నాతో పాటు మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నేతలను శిక్షించండి… కనీసం రెండు బెత్తం దెబ్బలు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సందర్భంగా నటి పూనంకౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు కృతజ్ఞతలు చెప్పిన ఆమె…. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ”నాతో పాటు పలువురు మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్‌ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నాను… ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు” అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె దీన్ని తొలించినా అప్పటికే స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అవుతున్నాయి.

పూనంకౌర్‌ చేసిన ట్వీట్‌లో కొన్ని పోలికలు ఆసక్తిగా ఉన్నాయి. తనతో పాటు పలువురు మహిళలను మోసం చేసిని సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షించాలని కోరడం ఆసక్తిగా ఉంది. అదే సమయంలో ‘రెండు బెత్తం దెబ్బలు’ అన్న మాట… ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పోలి ఉన్నాయి.

‘రేపిస్టులను చంపే హక్కు ఎవరికీ లేదు రెండు బెత్తం దెబ్బలు కొట్టండి చాలు’ అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు పూనం కూడా సినీ అలియాస్ రాజకీయ నాయకులు అని వ్యాఖ్యానించడం ఆసక్తిగా ఉంది.

గతంలో కత్తి మహేష్‌ కూడా పూనంకౌర్‌కు ఏపీలో ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న సినీ హీరోకు మధ్య సంబంధాలపై అనేక విషయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో పూనం కౌర్ ట్వీట్ రాజకీయ నాయకుడిగా మారిన సదరు హీరోను ఉద్దేశించి చేసినవేనని సోషల్ మీడియాలో పెద్దెత్తున నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.