Telugu Global
NEWS

టీ-20 వెయ్యి పరుగుల క్లబ్ లో రాహుల్

1000 పరుగుల భారత 7వ క్రికెటర్ రాహుల్ భారత యువఓపెనర్ కెఎల్ రాహుల్ ..ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో వెయ్యి అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత 7వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన తొలి టీ-20లో రాహుల్ కేవలం 40 బాల్స్ లోనే స్ట్ర్రోక్ పుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు. హేమాహేమీల సరసన… అత్యంత వేగంగా వెయ్యి పరుగులు […]

టీ-20 వెయ్యి పరుగుల క్లబ్ లో రాహుల్
X
  • 1000 పరుగుల భారత 7వ క్రికెటర్ రాహుల్

భారత యువఓపెనర్ కెఎల్ రాహుల్ ..ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో వెయ్యి అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత 7వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన తొలి టీ-20లో రాహుల్ కేవలం 40 బాల్స్ లోనే స్ట్ర్రోక్ పుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు.

హేమాహేమీల సరసన…

అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన క్రికెటర్ల వరుసలో.. రాహుల్ సంయుక్త తృతీయస్థానంలో నిలిచాడు. 27 సంవత్సరాల రాహుల్ తన కెరియర్ 29వ ఇన్నింగ్స్ లో 1000 పరుగులు సాధించడం ద్వారా…. గతంలో ఇదే ఘనత సాధించిన ఆస్ట్ర్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్ సరసన నిలువగలిగాడు.

టీ-20 క్రికెట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడి ప్రపంచ రికార్డు… పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ అజామ్ పేరుతో ఉంది. బాబర్ అజామ్ కేవలం 26 ఇన్నింగ్స్ లోనే వెయ్యి పరుగులు సాధిస్తే… విరాట్ కొహ్లీ 27 ఇన్నింగ్స్ లో అదే ఘనతను అందుకోడం ద్వారా…రెండోస్థానంలో నిలిచాడు.

First Published:  7 Dec 2019 1:32 AM GMT
Next Story