క్యాంపు ఆఫీస్ సదుపాయాల జీవోలను రద్దు చేయించిన జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాట్లకు అవసరమైన నిధులు విడుదల చేస్తూ ఇచ్చిన ఆరు జీవోలను రద్దు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నిధుల విడుదలకు సంబంధించిన జీవోలను అధికారులు రద్దు చేశారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్‌ కోసం 39 లక్షలు, వార్షిక నిర్వాహణ పనులకు కోటి 20 లక్షలు, 22 లక్షలతో క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చే సందర్శకుల కోసం ఏర్పాట్లు, భద్రతపరమైన ఉపకరణాల కోనుగోలు వంటి వాటి కోసం పలు జీవోలు ఇచ్చారు.

అయితే ఈ జీవోలను రద్దు చేయాల్సిందిగా సీఎం ఆదేశించడంతో వాటిని రద్దు చేశారు.