రూలర్ ట్రయిలర్ రివ్యూ

ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా రిలీజైంది రూలర్ ట్రయిలర్. ఇప్పటికే విడుదలై టీజర్ కు కొనసాగింపుగా ఉన్న ఈ ట్రయిలర్ చూస్తే, ఎన్నో అనుమానాలు రేకెత్తడం సహజం. మరీ ముఖ్యంగా బాలయ్య గెటప్ పై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు బాలయ్య సినిమాల్లో చాలా కథాపరంగా ఫెయిల్ అయినవి ఉన్నాయి తప్ప, అతడి గెటప్ పరంగా ఫ్లాప్ అయిన సినిమాలు చాలా తక్కువ. అలాంటి ప్రయోగాల్ని పదేళ్ల కిందటే ఆపేశాడు బాలయ్య. అతడికి ఎక్కువ ఫ్లాపులు ఆ గెటప్స్ పైనే పడ్డాయి అప్పట్లో. ఇప్పుడు మరోసారి పెద్దగా క్లిక్ అవ్వని గెటప్ తో బాలయ్య సినిమా చేశాడు.

రూలర్ టీజర్ లో బాలయ్య గెటప్స్ ను కాస్త మేనేజ్ చేశారు కానీ, ట్రయిలర్ లో మాత్రం కవర్ చేయలేకపోయారు. ఈరోజు రిలీజైన ట్రయిలర్ లో బాలయ్య గెటప్స్ పై మరోసారి విమర్శలు చెలరేగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ట్రయిలర్ ప్రారంభమైన నిమిషం వరకు బాలయ్య డైలాగ్ లేకపోవడం అభిమానుల్ని నిరాశకు గురిచేసింది.