జీఎస్టీని భారీగా బాదేందుకు సిద్ధమవుతున్న కేంద్రం!

కేంద్ర ప్రభుత్వం ప్రజలను జీఎస్టీ రూపంలో మరోసారి వాయించేందుకు సిద్ధమవుతోంది. జీఎస్టీ రేట్లు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే వారం జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం… జీఎస్టీ బేస్‌ శ్లాబ్‌ ప్రస్తుతం 5 శాతం ఉండగా… దాన్ని 9 నుంచి 10 శాతానికి పెంచబోతున్నారు.

12శాతం శ్లాబ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఇప్పటి వరకు ఆ శ్లాబ్‌లో ఉన్న 243 వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి మార్చనున్నారు. ఇప్పటి వరకు పలు వస్తు సేవలకు పన్ను మినహాయింపు ఉంది. ఆ మినహాయింపులను ఇకపై పక్కనపెట్టనున్నారు.

ఈ మార్పుల వల్ల భారీగా ప్రభుత్వానికి ఆదాయం రానుంది. అదే సమయంలో ప్రజలపై భారం పడనుంది.