కొడుకు కోసం దర్శకుడికి 6కోట్ల ఆఫర్ ఇచ్చిన దానయ్య?

రాజమౌళితో ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తీస్తున్న టాలీవుడ్ నిర్మాత డీవీవీ దానయ్య ఆ సినిమాతో బడా నిర్మాతగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ‘భరత్ అనే నేను’ సహా టాప్ చిత్రాలు తీసి సక్సెస్ ఫుల్ నిర్మాతగా దానయ్య పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే కోవలో తన కొడుకును టాలీవుడ్ లో హీరోగా లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఈ మేరకు ఓ కామెడీ టైమింగ్ యువ దర్శకుడితో డీల్ సెట్ చేసుకున్నట్టు తెలిసింది. డైరెక్టర్ మారుతిని తన కొడుకును లాంచ్ చేసేందుకు ఏకంగా రూ.6 కోట్ల ఆఫర్ ను నిర్మాత డీవీవీ దానయ్య ఇచ్చినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు మారుతి కెరీర్ పడుతూ లేస్తూ ఉంది. ఒక సినిమా హిట్.. మరో సినిమా ఫట్ అన్నట్టుగా సాగుతోంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వం లో ‘ప్రతిరోజు పండుగే’ అన్న మూవీ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మారుతి డిసెంబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో అంత హిట్ ట్రాక్ లేకున్నా ఏకంగా 6 కోట్ల ఆఫర్ ను మారుతి అందుకోవడం అంటే సంచలనమే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తీసుకున్నంత పారితోషకాన్ని అందుకుంటున్నాడు. తన కొడుకును లాంచ్ చేయడానికి అగ్ర దర్శకులను సంప్రదించిన దానయ్య…. చివరకు కుదరకపోవడంతోనే మారుతితో డీల్ కుదుర్చుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.