“పండగ” ప్రచారం షురూ

సాయితేజ్ హీరోగా నటిస్తున్న ప్రతిరోజూ పండగే సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. సినిమా యూనిట్ అంతా కలిసి రోడ్ షో ప్రారంభించారు. విశాఖ నుంచి ప్రారంభమైంది ఈ రోడ్ ప్రచారం. గాజువాక, అనకాపల్లి, నక్కపల్లి, పాయకరావుపేట, అన్నవరం, కాకినాడ టచ్ చేస్తూ రోడ్ షో జరగబోతోంది. ఇది మొదటి విడత మాత్రమే. దీని తర్వాత రెండో రౌండ్ ప్రచారాన్ని బయటపెడతారు.

నిజానికి పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ లో ఇలాంటి పనులు ఎవ్వరూ పెట్టుకోరు. ఎందుకంటే సినిమా పనులు పెండింగ్ లో ఉంటాయి కాబట్టి. కానీ సినిమాకు సంబంధించి ఊహించిన దానికంటే ముందే షూటింగ్ అయిపోయింది. 2 వారాల ముందే ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. సెన్సార్ కు ఫుల్ కాపీ అందించబోతున్నారు. ఇంత పక్కా ప్లానింగ్ తో ఉన్నారు కాబట్టే, ఏకంగా రోడ్డు ప్రచారం స్టార్ట్ చేశారు.

ఇక నుంచి సినిమాకు సంబంధించి ప్రతి ప్రచారాన్ని ఇలా బస్సు నుంచే నిర్వహించాలని భావిస్తున్నారు. మధ్యమధ్యలో మంచి సెంటర్లు చూసుకొని మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. ఈరోజు రాత్రికి విజయవాడ చేరుకోవాలనేది యూనిట్ ప్లాన్. మధ్యలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, సోమవారం కూడా యాత్ర కొనసాగించాలని యూనిట్ నిర్ణయించింది.