సానియా సోదరి వివాహవేడుకలు షురూ

  • అజార్ కోడలు కానున్న సానియా చెల్లెలు ఆనమ్

భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ కుటుంబాలు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నాయి.

సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా ను మహ్మద్ అజరుద్దీన్ కుమారుడు అసద్ మరి కొద్దిరోజుల్లో నిఖా చేసుకోబోతున్నాడు.

గత నెలలోనే ఈ రెండు కుటుంబాలు కలిసి నిశ్ఛితార్థం వేడుకలను ముగించాయి. ఈనెల మూడో వారంలో జరిగే ఈ వివాహానికి ముందే సానియా సోదరి ఆనమ్ తన స్నేహితులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది.

ఈ విందులో భాగంగా వధువు అలంకరణ ఫోటోలను, వీడియోలను విడుదుల చేసింది.ఆనమ్ తన సోదరి సానియాతో కలసి స్నేహితురాళ్ల బృందంతో దిగిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో ఉంచింది.

ఆనమ్ మీర్జా ఫోటోలకు ఇన్ స్టాగ్రామ్ లో ఉంచిన ఫోటోలకు విపరీతమైన లైక్ లు వచ్చాయి. మహ్మద్ అసదుద్దీన్ సైతం ఆనమ్ మీర్జాతో కలసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మొత్తం మీద ఆనమ్- అసద్ ల వివాహంతో సానియా మీర్జా- అజరుద్దీన్ కుటుంబాలు ఒక్కటి కాబోతున్నాయి.