నిర్భయ హంతకుల ఉరికి ముహూర్తం ఖరారు… 10 ఉరితాళ్లు పంపిన బక్సర్ అధికారులు

నిర్భయ హంతకులను ఉరి తీసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న ఉదయం 5 గంటలకు నిర్భయ దోషులు నలుగురిని ఉరి తీయనున్నారు. ఉరి శిక్ష రద్దు కోరుతూ వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. దాంతో ఉరి ఖాయమైంది. ప్రస్తుతం దోషులు తీహార్ జైలులో ఉన్నారు.

ఉరితీతకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ నేరస్తులను ఉరి తీసేందుకు అవసరమైన ఉరి తాళ్లు కావాలంటూ బక్సర్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు. తీహార్ జైలు అధికారుల విజ్ఞప్తి మేరకు బక్సర్ జైలు సిబ్బంది 10 ఉరి తాళ్లను తీహార్ జైలుకు పంపించారు.

2012 డిసెంబర్‌ 16న ఆరుగురు వ్యక్తులు కలిసి ఢిల్లీలో నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశారు. ఆరుగురిలో ఒక మైనర్ జువైనల్ కస్టడీలో ఉన్నాడు. మరో దోషి రామ్ సింగ్… జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురిని సోమవారం ఉరి తీయనున్నారు.