అసెంబ్లీలో టీడీపీ నేతలకు జలక్ ఇచ్చిన వంశీ

టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టాడు.. లోకేష్ వ్యవహారాలను ఎండగట్టాడు.. చంద్రబాబు చేసిన పాపాలు, మోసాలను వివరించాడు.. టీడీపీని వీడాడు.. అయితే ఇప్పుడు అసెంబ్లీ కొచ్చాడు. ఆయన ఎక్కడ కూర్చుంటాడని అందరూ ఎదురు చూస్తున్న వేళ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు వల్లభనేని వంశీ.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం చంద్రబాబు, లోకేష్, టీడీపీ బ్యాచ్ ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలను ట్రోల్స్ చేసింది.

దానికి కౌంటర్ గా వంశీ వాటిపై గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తనపై టీడీపీ చేస్తున్న కుట్రలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. టీడీపీ గుట్టుమట్లను విప్పి పచ్చబ్యాచ్ కు షాకిచ్చాడు. లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తీసుకొచ్చాడు.

అయితే ఇంత చేసిన వల్లభనేని వంశీ…. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో అధికారికంగా చేరలేదు. కానీ జగన్ పాలనను మాత్రం మెచ్చుకున్నాడు. దీంతో ఆయన అసెంబ్లీకి వస్తే ఎటువైపు కూర్చుంటాడన్న ఆసక్తి అందరిలోనూ ఉండింది.

తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వల్లభనేని వంశీ టీడీపీ సభ్యులకు కేటాయించిన సీట్లలోనే వెనుక వరుసలో కూర్చున్నారు. ఎవరితో సంబంధం లేకుండా చంద్రబాబు వెనుకాల చివరన కూర్చోని అందరికీ షాక్ ఇచ్చాడు వంశీ.