Telugu Global
NEWS

టీడీపీకి సినీ ఫీల్డే పునాది...

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. టీడీపీ ప్రచారం చేస్తున్నట్టుగా రాష్ట్ర ఆదాయం 40 శాతం తగ్గలేదని… కేవలం 8 శాతం మాత్రమే తగ్గిందన్నారు. ఇలా ఆదాయం తగ్గడం కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాలేదని… దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆదాయం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని… ఆర్థిక సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయమేకాదు.. దేశ ఆదాయం కూడా తగ్గిందని బుగ్గన అన్నారు. ఏ […]

టీడీపీకి సినీ ఫీల్డే పునాది...
X

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. టీడీపీ ప్రచారం చేస్తున్నట్టుగా రాష్ట్ర ఆదాయం 40 శాతం తగ్గలేదని… కేవలం 8 శాతం మాత్రమే తగ్గిందన్నారు. ఇలా ఆదాయం తగ్గడం కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాలేదని… దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు.

ఆదాయం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని… ఆర్థిక సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయమేకాదు.. దేశ ఆదాయం కూడా తగ్గిందని బుగ్గన అన్నారు.

ఏ ప్రభుత్వమైనా ఐదారు వేల కోట్లు బిల్లులు చెల్లించకుండా వెళ్ళడం పరిపాటేనని… కానీ గత ప్రభుత్వం ఏకంగా 40 వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌ లో పెట్టి వెళ్లిపోయిందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం చేసిన 20 వేల కోట్ల అప్పును ఆరు నెలల్లో చెల్లించామని చెప్పారు. గత సంవత్సరం జూలై, నుంచి డిసెంబర్ మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం 24 రోజులు ఓడీలో ఉందని… కానీ ఈ ప్రభుత్వం జూలై నుంచి డిసెంబర్ మధ్యలో కేవలం రెండు రోజులు మాత్రమే ఓడీలో ఉంది అని బుగ్గన వివరించారు. తాను ఏది చెప్పినా ఆధారాలతోనే చెబుతుంటానని… ఆ ఆధారాల గురించి మాత్రం చంద్రబాబు మాట్లాడకుండా ఇతర అంశాలపైనే మాట్లాడుతుంటారని బుగ్గన ఎద్దేవా చేశారు.

ప్రతి పార్టీకి ఒక పునాది ఉంటుందని… వైసీపీకి వైఎస్‌ఆర్‌, మాట తప్పకపోవడం అన్నది పునాదిగా ఉంటే… టీడీపీకి మాత్రం ఫీల్మ్ ఫీల్డే పునాదిగా ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంటారని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్నికల ప్రచార ప్రకటనలు చూసినా ఆ విషయం అర్థమవుతుందన్నారు.

First Published:  10 Dec 2019 6:00 AM GMT
Next Story