నాగబాబు ప్రభావం జబర్ధస్త్ పై ఏమాత్రం లేదా?

జబర్ధస్త్ నుంచి నాగబాబు నిష్క్రమించారు. మరి ఆయన వైదొలగడంతో జబర్ధస్త్ పని అయిపోయిందా.? దాని రేటింగ్ పడిపోతుందా? ఆ కార్యక్రమం కుదేలవుతుందా? అన్న అభిప్రాయం మీడియా పరిశీలకుల్లో వ్యక్తమైంది.

అయితే నాగబాబు వైదొలిగినా ప్రస్తుత టీఆర్పీ రేటింగ్ లను చూస్తే జబర్ధస్త్ చెక్కు చెదరలేదని తేటతెల్లమైంది. ప్రోగ్రాం బ్రాండ్, రేటింగ్ తగ్గలేదని తెలిసింది.

తాజాగా రేటింగులతో జబర్ధస్త్ కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని తేలింది. ప్రజాదరణలో సాటి లేదని తెలిసివచ్చింది. జబర్ధస్త్ కామెడీ షో తెలుగు నాట బాగా ప్రాచుర్యం పొందింది. ఎంతో మంది అభిమానులున్నారు. యూట్యూబ్ లో మిలియన్స్ మంది చూస్తారు. అయితే నాగబాబు ఏడేళ్లుగా జడ్జిగా ఉండి వైదొలగడంతో దీని రేటింగ్ తగ్గుతుందని అంతా భావించారు.

అయితే నాగబాబు ఈ కార్యక్రమానికి కేవలం జడ్జి మాత్రమే. అతను క్రియేటివ్ హెడ్ కానీ.. కీలక పాత్ర ధారి కూడా కాదు. దీంతో నాగబాబు వైదొలిగినా కూడా జబర్ధస్త్ లో ఏమాత్రం మార్పు లేకపోవడం గమనార్హం.

ఇక జబర్ధస్త్ లోని కొందరిని నాగబాబు ఇతర చానెల్స్ కు తీసుకెళ్లి ప్రోగ్రాంలు చేయించినా జబర్ధస్త్ కి మాత్రం రేటింగ్ తగ్గలేదు. దీంతో నాగబాబుపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నాగబాబు ఉన్నా లేకున్నా జబర్ధస్త్ కు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేస్తున్నారు.