హెరిటేజ్ ఉల్లి రూ. 200…. మాకు సంబంధం లేదన్న భువనేశ్వరి

ఉల్లి ధరలపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్పందించారు. ఉల్లి ధరలు ఈ స్థాయిలో పెరగడం తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.

ఒక గృహిణిగా ఉల్లి ధర ఈ స్థాయికి చేరడాన్ని తాను సమర్ధించబోనన్నారు. ధరలను దించేందుకు వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె.

హెరిటేజ్ స్టోర్లలో ఉల్లి కిలో 200 రూపాయలకు అమ్ముతుండడంపైనా ఆమె స్పందించారు. హెరిటేజ్‌లో 200కు ఉల్లి అమ్ముతున్న విషయాన్ని ఆమె పరోక్షంగా అంగీకరించారు.

అయితే హెరిటేజ్ ఫ్రెష్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ఫ్రెష్ ప్రస్తుతం ప్యూచర్‌ గ్రూపులో భాగంగా పనిచేస్తోందని… కాబట్టి అక్కడి ధరలతో తమకు సంబంధం లేదన్నారామె.