2019 టూర్ పైనల్స్ పైనే సింధూ ఆశలు

  • టూర్ ఫైనల్స్ లో భారత ఏకైక ప్లేయర్ సింధు

భారత బ్యాడ్మింటన్ క్వీన్ సింధుకు 2019 సీజన్ మిశ్రమ ఫలితాలతో సాగుతోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ విజయం తర్వాత వరుసగా ఆరు టో్ర్నీల ప్రారంభ రౌండ్లలోనే
పరాజయాలు చవిచూసిన సింధు… ర్యాంకింగ్స్ లో సైతం 15వ స్థానానికి పడిపోయింది.

అయితే… ప్రపంచ టైటిల్ విజయం ద్వారా చైనాలోని గాంగ్జావో వేదికగా డిసెంబర్ 11న ప్రారంభమయ్యే 2019 సీజన్ ఆఖరి టోర్నీ టూర్ ఫైనల్స్ లో పాల్గొనటానికి
25 సంవత్సరాల సింధు అర్హత సంపాదించింది.

గత రెండు వారాలుగా కఠోరసాధన చేసిన సింధు..గ్రూప్ -ఏలో చైనా ప్లేయర్ చెన్ యూఫే, అకానే యమగుచి, హీ జెంగ్ పియావో లతో తలపడనుంది.

గ్రూప్ – బీ లీగ్ లో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జు ఇంగ్, నజోమీ ఒకుహరా, ఇంటానెన్ రచనోక్, బుసానన్ ఓంగుమురాపన్ పోటీపడనున్నారు.

టోక్యో ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించాలంటే సింధూ ఈటోర్నీలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే ఒలింపిక్స్, ప్రపంచ టోర్నీ పతకాలు సాధించిన సింధు కెరియర్ లో ఇదే అతిపెద్ద పరీక్షకానుంది.