మహేష్ ను చూసి కాదు…. అనీల్ రావిపూడి కోరితేనే ఒప్పుకున్నాను

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో తను కూడా ఉన్నానని గతంలో స్పష్టంచేసింది తమన్న. ఇప్పుడా సినిమా సెట్స్ పైకి మిల్కీబ్యూటీ జాయిన్ అయింది. నిన్నట్నుంచి సరిలేరు నీకెవ్వరు ఐటెంసాంగ్ షూటింగ్ మొదలైంది. మహేష్-తమన్న మధ్య ఈ సాంగ్ తీస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సాంగ్ షూట్ నడుస్తోంది.

నిజానికి ఈ సాంగ్ ఒప్పుకోవడానికి మహేష్ మెయిన్ రీజన్ కాదంటోంది తమన్న. అనీల్ రావిపూడి కోరడంతోనే ఈ పాట చేయడానికి ఒప్పుకున్నానని ప్రకటించింది. ఎఫ్2 సినిమాతో తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి.. అనీల్ కోరిన వెంటనే కాదనలేకపోయానని చెప్పుకొచ్చింది.

ఈ పాట షూటింగ్ తో సరిలేరు నీకెవ్వరు టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మరో 2 రోజుల్లో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.