Telugu Global
NEWS

రేష‌న్ కార్డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం.... ఇలా దొరికారు...

రేషన్ కార్డులపై టీడీపీ నేత‌లు ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు ప్రచారం చేసినట్లు బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌భుత్వాన్ని బ‌ద‌నాం చేయాలని టీడీపీ రేషన్ డీలర్ కావాలనే ఈ పని చేసినట్టు అధికారులు గుర్తించారు. తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామం డీలర్ మద్దిపూడి మంగదేవి తప్పుడు ప్రచారం చేసినట్టు నిర్ధారించారు. మంగ‌దేవి భ‌ర్త టీడీపీ నేత‌. రేష‌న్ కార్డుల‌పై జీస‌స్ ఫోటో ముద్రించి గ్రామంలో ఆయ‌నే పంచిపెట్టార‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో రేష‌న్ డీల‌ర్‌పై చ‌ర్య‌లు […]

రేష‌న్ కార్డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం.... ఇలా దొరికారు...
X

రేషన్ కార్డులపై టీడీపీ నేత‌లు ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు ప్రచారం చేసినట్లు బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌భుత్వాన్ని బ‌ద‌నాం చేయాలని టీడీపీ రేషన్ డీలర్ కావాలనే ఈ పని చేసినట్టు అధికారులు గుర్తించారు.

తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామం డీలర్ మద్దిపూడి మంగదేవి తప్పుడు ప్రచారం చేసినట్టు నిర్ధారించారు. మంగ‌దేవి భ‌ర్త టీడీపీ నేత‌. రేష‌న్ కార్డుల‌పై జీస‌స్ ఫోటో ముద్రించి గ్రామంలో ఆయ‌నే పంచిపెట్టార‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో రేష‌న్ డీల‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

కావాల‌నే డీలర్ ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేశార‌ని అధికారుల విచార‌ణ‌లో తేలింది. గ‌తంలో ఆయ‌న 2016లో సాయిబాబా ఫోటో ముద్రించారు. ఆ త‌ర్వాత 2017,18 లో బాలాజీ ఫోటో వేశార‌ని… కానీ ఈ ఏడాది కావాల‌నే జీసస్ ఫోటో వేశార‌ని అధికారుల విచారణలో తేలింది.

మంగ‌దేవి భ‌ర్త టీడీపీ వీరాభిమాని. ఆ పార్టీతో ల‌బ్ధి పొందారు. దీంతో ఈ ప‌ని చేసి…వైసీపీ సర్కార్‌పై బురదజల్లడానికి ప్రయత్నించాడని విచారణలో తేలింది. మంగ‌దేవి రేష‌న్ డీల‌ర్ తొల‌గించాల‌ని స్థానికులు అధికారుల‌కు ఫిర్యాదు చేశారు .

వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకే, పార్టీ పెద్దల సూచనల మేరకు తాజాగా క్రీస్తు ఫొటోను ముద్రించినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అన్యమత ప్రచారం పేరుతో టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా కొద్దిరోజులుగా వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గ్రామస్థాయిలో తమకు కుదిరిన ప్రాంతాల్లో ఇలాంటి చర్యలకు టీడీపీ శ్రేణులు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

First Published:  10 Dec 2019 1:08 AM GMT
Next Story