అల.. స్టయిలిష్ గా.. బన్నీ

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి టీజర్ రిలీజైంది. అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబో నుంచి ఆడియన్స్ ఏవైతే ఆశిస్తున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ టీజర్ లో కనిపించాయి. అందుకేనేమో విడుదలైన 7 నిమిషాలకే మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ముందుగా బన్నీ విషయానికొస్తే.. క్లాస్-మాస్ మిక్స్ లో లుక్ పరంగా ఆకట్టుకున్నాడు. నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా అనే డైలాగ్ తో టోటల్ టీజర్ కే హైలెట్ గా నిలిచాడు. టీజర్ లోనే కీలకమైన నటీనటులందర్నీ పరిచయం చేశాడు. ఇటు బన్నీ స్టయిల్ తో పాటు, అటు త్రివిక్రమ్ మార్క్ టీజర్ లో స్పష్టంగా కనిపించింది.

ఇవన్నీ ఒకెత్తయితే.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 3 పాటలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన తమన్, టీజర్ కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. టీజర్ ఇంతలా ఎలివేట్ అవ్వడానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కారణం. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది అల వైకుంఠపురములో.