Telugu Global
NEWS

నేటినుంచే ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ ఫైనల్స్

పీవీ సింధుకు 2019సీజన్లో ఆఖరి చాన్స్ ప్రపంచ బ్యాడ్మింటన్ 2019 సీజన్ ఆఖరి టోర్నీ…టూర్ ఫైనల్స్ సమరానికి చైనాలోని గాంగ్జావోలో రంగం సిద్ధమయ్యింది. డిసెంబర్ 11 నుంచి వారంరోజులపాటు జరిగే ఈ సూపర్ డూపర్ టోర్నీ మహిళల సింగిల్స్ మెయిన్ డ్రాకు భారత ప్లేయర్లలో కేవలం సింధు మాత్రమే అర్హత సంపాదించింది. సింధుకు ఆఖరి ఛాన్స్… ప్రస్తుత సీజన్లో ప్రపంచ టైటిల్ మినహా మిగిలిన ప్రధాన టోర్నీలలో దారుణంగా విఫలం కావడమే కాదు…వరుసగా ఆరో టోర్నీల ప్రారంభరౌండ్లలోనే ఇంటిదారి పట్టిన […]

నేటినుంచే ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ ఫైనల్స్
X
  • పీవీ సింధుకు 2019సీజన్లో ఆఖరి చాన్స్

ప్రపంచ బ్యాడ్మింటన్ 2019 సీజన్ ఆఖరి టోర్నీ…టూర్ ఫైనల్స్ సమరానికి చైనాలోని గాంగ్జావోలో రంగం సిద్ధమయ్యింది. డిసెంబర్ 11 నుంచి వారంరోజులపాటు జరిగే ఈ సూపర్ డూపర్ టోర్నీ మహిళల సింగిల్స్ మెయిన్ డ్రాకు భారత ప్లేయర్లలో కేవలం సింధు మాత్రమే అర్హత సంపాదించింది.

సింధుకు ఆఖరి ఛాన్స్…

ప్రస్తుత సీజన్లో ప్రపంచ టైటిల్ మినహా మిగిలిన ప్రధాన టోర్నీలలో దారుణంగా విఫలం కావడమే కాదు…వరుసగా ఆరో టోర్నీల ప్రారంభరౌండ్లలోనే ఇంటిదారి పట్టిన సింధు…తన ర్యాంక్ ను సైతం టాప్ -10 నుంచి 15వ స్థానానికి కోల్పోవాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడం సైతం క్లిష్టంగా మారింది.

ఐదు విభాగాలలో పోటీ…

మొత్తం ఐదు విభాగాలలో కేవలం ఒక్క విభాగానికి మాత్రమే భారత్ పరిమితం కావాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, మహిళల, పురుషుల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో సీజన్ ఫైనల్స్ టోర్నీనిర్వహించనున్నారు.
మహిళల సింగిల్స్ లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు భారత్ కు ప్రాతినిథ్యం వహించనుంది.

కఠోర సాధనతో సింధు రెడీ..

సీజన్ ముగింపు టోర్నీ కోసం గత రెండువారాలుగా కఠోరసాధన చేసిన సింధు..గ్రూప్-ఏ లో చైనా ప్లేయర్ చెన్ యూఫే, అకానే యమగుచి, హీ జెంగ్ పియావో లతో తలపడనుంది.

గ్రూప్ – బీ లీగ్ లో ప్రపంచ నంబర్ వన్ తాయ్ జు ఇంగ్, నజోమీ ఒకుహరా, ఇంటానెన్ రచనోక్, బుసానన్ ఓంగుమురాపన్ పోటీపడనున్నారు.

టోక్యో ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించాలంటే సింధూ ఈటోర్నీలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే ఒలింపిక్స్, ప్రపంచ టోర్నీ పతకాలు సాధించిన సింధు కెరియర్ లో ఇదే అతిపెద్ద పరీక్షకానుంది.

ర్యాంకులు డౌన్…..

మహిళల సింగిల్స్ లో ప్రపంచ విజేతగా నిలిచిన పీవీ సింధు ఆ తర్వాత వరుస పరాజయాలతో 15వ ర్యాంక్ కు పడిపోయింది. టూర్ ఫైనల్స్ లో ప్రపంచ మొదటి తొమ్మిది ర్యాంకుల్లో నిలిచిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. మహిళల సింగిల్స్ విశ్వవిజేతగా నిలిచిన కారణంగా సింధు టోర్నీలో పాల్గొనటానికి అర్హత సాధించగలిగింది.

2019 సీజన్లో సింధు ప్రపచ టైటిల్, సైనా ఇండోనీషియా టైటిల్, థాయ్ డబుల్స్ టైటిల్ ను రంకిరెడ్డి- చిరాగ్ జోడీ సాధించడం మినహా..భారత్ కు చేదుఫలితాలే ఎదురయ్యాయి. సైనా 23, రియా ముఖర్జీ 63 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

పురుషుల సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్ 16, సాయి ప్రణీత్ 17, కిడాంబీ శ్రీకాంత్ 18 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
పురుషుల డబుల్స్ లో రంకిరెడ్డి- చిరాగ్ జోడీ 22, మహిళల డబుల్స్ లో అశ్వని-సిక్కిరెడ్డి జోడీ 21వ ర్యాంక్ లో ఉన్నారు.

First Published:  10 Dec 2019 9:02 PM GMT
Next Story