Telugu Global
NEWS

భారత్- విండీస్ సిరీస్ లో క్లైయ్ మాక్స్

ముంబైలో నేడే టీ-20 ఆఖరి పోరాటం మ్యాచ్ నెగ్గిన జట్టుకే టీ-20 సిరీస్ భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ టీ-20 షో ముగింపుదశకు చేరింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ముగిసిన మొదటి రెండుమ్యాచ్ ల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో …ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే ఆఖరి మ్యాచ్ రెండుజట్లకూ డూ ఆర్ డై గా మారింది. హైదరాబాద్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్లతో నెగ్గితే…తిరువనంతపురం […]

భారత్- విండీస్ సిరీస్ లో క్లైయ్ మాక్స్
X
  • ముంబైలో నేడే టీ-20 ఆఖరి పోరాటం
  • మ్యాచ్ నెగ్గిన జట్టుకే టీ-20 సిరీస్

భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ టీ-20 షో ముగింపుదశకు చేరింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ముగిసిన మొదటి రెండుమ్యాచ్ ల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో …ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే ఆఖరి మ్యాచ్ రెండుజట్లకూ డూ ఆర్ డై గా మారింది.

హైదరాబాద్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్లతో నెగ్గితే…తిరువనంతపురం మ్యాచ్ లో విండీస్ 8 వికెట్లతో భారత్ ను చిత్తు చేసి సమఉజ్జీగా నిలిచింది.

టాసే కీలకం….

ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరి మ్యాచ్ లో సైతం టాసే కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా చేజింగ్ కు దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 5వ ర్యాంక్ లో ఉన్న భారత్ కు 10వ ర్యాంకర్ విండీస్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. రెండుజట్లలోనూ పలువురు సూపర్ హిట్టర్లు ఉండటంతో…మ్యాచ్ సిక్సర్ల యుద్ధంలా సాగే అవకాశం ఉంది.

సిక్సర్లే సిక్సర్లు…

మొదటి రెండుమ్యాచ్ ల్లోనే రెండుజట్లూ కలసి 44 సిక్సర్లు బాదడం చూస్తే…సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో సైతం సిక్సర్లు వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత ఓపెనర్ రోహిత్ శర్మ, యువఆటగాడు శివం దూబే, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా , రిషభ్ పంత్ సిక్సర్ల బాదుడులో మొనగాళ్లుగా ఉంటే… విండీస్ జట్టులో లెండిల్ సిమ్మన్స్, ఇవిన్ లూయిస్, హెట్ మేయర్, నికోలస్ పూరన్, కీరాన్ పోలార్డ్ సైతం అలవోకగా సిక్సర్లు బాదగలిగిన సత్తా ఉన్న ఆటగాళ్లే.

తన కెరియర్ లో ఇప్పటికే 399 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ…హోంగ్రౌండ్ వాంఖెడీ మ్యాచ్ లో మరో సిక్సర్ బాదగలిగితే…భారత క్రికెట్లో నే 400 అంతర్జాతీయ సిక్సర్లు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరగలుగుతాడు.

మరోవైపు…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో 3 పరుగులు చేయగలిగితే…టీ-20 క్రికెట్లో అత్యథిక పరుగులు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

ముంబై మ్యాచ్ లో సైతం అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

భారత్ 9- విండీస్ 6

రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…విండీస్ పైన భారత్ కు 9 విజయాలు, భారత్ పైన విండీస్ కు 6 విజయాల రికార్డు ఉంది. ఇక సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ కు వేదికగా ఉన్న వాంఖెడీ స్టేడియంలో మాత్రం…ఈ రెండుజట్లూ గతంలో తలపడిన సమయంలో కరీబియన్ జట్టే విజేతగా నిలిచింది.

ఈ నేపథ్యంలో రెండుజట్లూ విజయమే లక్ష్యంగా సమరానికి సై అంటే సై అంటున్నాయి. విండీస్ తో పోల్చిచూస్తే ఆతిథ్య భారతజట్టే తీవ్రమైన ఒత్తిడినడుమ ఆఖరిపోరాటానికి సిద్ధమయ్యింది.

కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ రాహుల్ పూర్తిస్థాయిలో రాణించగలిగితేనే భారత్ విజేతగా నిలువగలుగుతుంది.

భారత కాలమానప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

First Published:  11 Dec 2019 1:40 AM GMT
Next Story