వైఎస్ జగన్ పై జేసీ ప్రశంసలు

జగన్ పాలనపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మరో సారి ప్రశంసలు కురిపించారు. జగన్ ఆరు నెలల పాలన బాగుందని వ్యాఖ్యానించారు. జగన్ గట్స్ ఉన్న నాయకుడు అని అన్నారు.

అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేసిన జేసీ… జగన్ ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా చెప్పి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ విషయంలో జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పారు జేసీ.

జగన్ ఎదురుపడితే అభినందనలు తెలుపుతా అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏమి అనుకున్నా తనకు ఇబ్బంది లేదన్నారు.