Telugu Global
NEWS

బినామీల భాగోతం బయటపడనుందా?

అమరావతి రాజధాని కోసం రైతుల నుంచి 33వేల ఎకరాల భూమిని సేకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితం అయ్యే రాజధాని అమరావతి కోసం దేశవిదేశాల్లోనూ చర్చ జరిగింది. అమరావతి చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరం 50లక్షల మేర ఉంటే అది ఏకంగా ఐదారు కోట్ల రూపాయల వరకూ వెళ్లింది. పనిలో పనిగా ప్రభుత్వం పేదలకోసం ఇచ్చిన భూముల్ని సైతం పెద్దలు,అదికారంలో ఉన్నవారు సొంతం చేసుకునే పనిచేపట్టారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం ఇచ్చిన ఎస్సైన్డ్ భూములను […]

బినామీల భాగోతం బయటపడనుందా?
X

అమరావతి రాజధాని కోసం రైతుల నుంచి 33వేల ఎకరాల భూమిని సేకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితం అయ్యే రాజధాని అమరావతి కోసం దేశవిదేశాల్లోనూ చర్చ జరిగింది. అమరావతి చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరం 50లక్షల మేర ఉంటే అది ఏకంగా ఐదారు కోట్ల రూపాయల వరకూ వెళ్లింది. పనిలో పనిగా ప్రభుత్వం పేదలకోసం ఇచ్చిన భూముల్ని సైతం పెద్దలు,అదికారంలో ఉన్నవారు సొంతం చేసుకునే పనిచేపట్టారు.

ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం ఇచ్చిన ఎస్సైన్డ్ భూములను సైతం కారు చౌకగా దక్కించుకున్నారు. ఇలా సొంతం చేసుకున్నవారిలో ఎక్కువ మంది టీడీపీ నేతలే ఉన్నారు. దీన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల్ని కోనుగోలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని రద్దు చేస్తూ క్యాబినెట్ కూడా తీర్మానించింది.

క్యాబినెట్ ఆమోదించిన 24 గంటల్లోగా సి.ఆర్.డి.ఎ. రంగంలోకి దిగింది. మొత్తం 2,500 ఎకరాలకు గాను, 450 ఎకరాల్లో నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు గుర్తించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురి ముఖ్యనేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రికి చెందిన బినామీల పేరుతో ఏకంగా 70 ఎకరాల్లో అక్రమాలు జరిగిట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు లంక భూముల్ని సైతం కాజేశారు. దీని వెనుక కూడా ప్రతిపక్షానికి చెందిన నేతలే కీలకంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం మీద చూస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకుంభకోణం ఒక్కొక్కటి వెలుగు చూస్తోంది. అసైన్డ్ భూములు, లంక భూముల విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వందల ఎకరాలు పేర్లు మారాయి. వీటి వెనక పెద్ద నేతలు ఉన్నారు. ఇవన్నీ వెలుగు చూస్తే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గానే వ్యవహరించాలని నిర్ణయించింది.

First Published:  12 Dec 2019 6:08 AM GMT
Next Story