Telugu Global
NEWS

వైఎస్‌ చనిపోయిన తర్వాత బాబులో మార్పు వచ్చింది అధ్యక్షా!

ముఖ్యమంత్రిని ఉన్మాది అంటూ దూషించిన చంద్రబాబునాయుడు క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని సూచించారు మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒకప్రతిపక్ష నాయకుడి తరహాలో లేదన్నారు. వైఎస్ బతికున్నంత కాలం చంద్రబాబు తీరు ఒకలా ఉండేదని… వైఎస్ చనిపోగానే ఇక రాష్ట్రంలో తనకు తిరుగులేదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహార శైలి ఉండేదన్నారు. ఎన్నికల ముందు తాను వైసీపీలో చేరుతున్నానని… మంత్రిగా కనిపిస్తానని చెబితే… వైసీపీ అధికారంలోకి రాదని చంద్రబాబు చెప్పారని అవంతి గుర్తు చేశారు. వైసీపీని, […]

వైఎస్‌ చనిపోయిన తర్వాత బాబులో మార్పు వచ్చింది అధ్యక్షా!
X

ముఖ్యమంత్రిని ఉన్మాది అంటూ దూషించిన చంద్రబాబునాయుడు క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని సూచించారు మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒకప్రతిపక్ష నాయకుడి తరహాలో లేదన్నారు.

వైఎస్ బతికున్నంత కాలం చంద్రబాబు తీరు ఒకలా ఉండేదని… వైఎస్ చనిపోగానే ఇక రాష్ట్రంలో తనకు తిరుగులేదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహార శైలి ఉండేదన్నారు. ఎన్నికల ముందు తాను వైసీపీలో చేరుతున్నానని… మంత్రిగా కనిపిస్తానని చెబితే… వైసీపీ అధికారంలోకి రాదని చంద్రబాబు చెప్పారని అవంతి గుర్తు చేశారు.

వైసీపీని, ముఖ్యమంత్రిని తిట్టాలనుకుంటే సాయంత్రం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టుకోవడం మంచిదని… అసెంబ్లీ సమయాన్ని మాత్రం వృథా చేయవద్దని కోరారు.

ఇటీవల అమరావతి అంటూ పర్యటనకు చంద్రబాబు వెళ్లగా చెప్పులు పడ్డాయని…. ఇంత సీనియర్ నేతపై జనం చెప్పులు వేయడం చూసి తాను కూడా బాధపడ్డానన్నారు. కానీ ఆ సమయంలో తనకు వైస్రాయ్ ఉదంతం గుర్తుకు వచ్చిందన్నారు. ఇతరులకు మనం ఏం చేస్తే భగవంతుడు మరో రూపంలో మనకూ అదే చేస్తారన్న భావన తనకు కలిగిందన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తామంతా వద్దని చెప్పినా… 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని… ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి ఒక్క మాట చెబితే 80 శాతం టీడీపీ ఖాళీ అవుతుందన్నారు. జగన్‌మోహన్ రెడ్డిలో మంచితనం ఉండడం వల్లే టీడీపీ మిగిలి ఉందన్నారు.

ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకుంటే తాను విశాఖలో ధర్నా చేశానని… ఆ సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించారని అవంతి వివరించారు.

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో పాటు రాజీనామా చేద్దామని తాను సూచిస్తే… టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించే ప్రసక్తేలేదు… కావాలంటే నీవు రాజీనామా చేయ్, ఉప ఎన్నికలు పెట్టిస్తా… అంటూ చంద్రబాబు తనను బెదిరించారని వెల్లడించారు.

మీడియా గురించి మాట్లాడుతున్న చంద్రబాబు… ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాక్షి జర్నలిస్టుల గురించి ఎంత చులకనగా మాట్లాడారో అందరికీ తెలుసన్నారు మంత్రి.

First Published:  12 Dec 2019 1:08 AM GMT
Next Story