Telugu Global
International

పౌరసత్వ బిల్లుతో.... బీజేపీ ఏం సంకేతమిచ్చింది?

పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లో వివక్షకు గురైన ముస్లిమేతర వ్యక్తులు, కాందీశీకులకు భారత పౌరసత్వం కల్పించే ఈ బిల్లును కేంద్ర హోమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, నిన్న రాత్రి రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లుకు మద్దతుగా 125 మంది ఓట్ చేయగా.. 99మంది వ్యతిరేకించారు. సభలో బిల్లు ఆమోదం పొందడంతో బీజేపీ పంతం నెగ్గింది. ఈ […]

పౌరసత్వ బిల్లుతో.... బీజేపీ ఏం సంకేతమిచ్చింది?
X

పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లో వివక్షకు గురైన ముస్లిమేతర వ్యక్తులు, కాందీశీకులకు భారత పౌరసత్వం కల్పించే ఈ బిల్లును కేంద్ర హోమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, నిన్న రాత్రి రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లుకు మద్దతుగా 125 మంది ఓట్ చేయగా.. 99మంది వ్యతిరేకించారు. సభలో బిల్లు ఆమోదం పొందడంతో బీజేపీ పంతం నెగ్గింది.

ఈ నిర్ణయంతో బీజేపీ దేశంలోని హిందువుల పక్షాన నిలిచిందని… మైనార్టీల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. అంతేకాదు.. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి భారీగా వలసలు వచ్చే ఈశాన్య రాష్ట్రాల్లోనూ అగ్గిరాజుకుంది. ఇతర దేశాల్లోని వారికి భారత పౌరసత్వం ఇచ్చి తమ హక్కులు కాలరాస్తారా? అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ బిల్లులో కేవలం హిందువులు, ఇతర ముస్లిమేతరులకు మాత్రమే భారత పౌరసత్వం ఇస్తామని బీజేపీ రూపొందించడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయం కారణంగా తమది హిందూ పార్టీ అని బీజేపీ చెప్పకనే చెప్పింది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, కాందీశీకులు మాత్రమే బయటకు వస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. అక్కడ బతకలేక ముస్లింలు కూడా భారత్ లోకి వలస వస్తున్నారు. అయితే కేవలం హిందువులు, కాందీశీకులకు మాత్రమే పౌరసత్వం ఇచ్చి ముస్లింలను విస్మరించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.

ఈబిల్లుతో తమది హిందుత్వం అని ఇతర దేశాల్లోని వారికి పౌరసత్వం ఇచ్చి వారిని ఓటుబ్యాంకుగా చూస్తామని బీజేపీ నిరూపించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

First Published:  12 Dec 2019 1:43 AM GMT
Next Story