Telugu Global
NEWS

ముఖ్యమంత్రిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు... అసెంబ్లీలో వీడియో ప్రదర్శన

అసెంబ్లీలోకి ప్లకార్డులతో వస్తున్న తమ పట్ల మార్షల్స్ అనుచితంగా వ్యవహరించారని , వారిపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు, టీడీపీ సభ్యులు చేసిన డిమాండ్ చివరకు వారి మెడకే చుట్టుకుంది. మార్షల్స్ తనను వెనక్కు తోసేశారని… కాబట్టి వారిపై చర్యలు తీసుకోకపోతే తాము అసెంబ్లీకి రావడం కూడా వృధా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనికి సమాధానం ఇచ్చిన శాసనసభ వ్యవహారాల ఇన్‌చార్జ్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి… రాజును చంపి పక్కనే నిలబడి గాడ్ సేవ్‌ కింగ్ అన్నట్టుగా చంద్రబాబు […]

ముఖ్యమంత్రిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు... అసెంబ్లీలో వీడియో ప్రదర్శన
X

అసెంబ్లీలోకి ప్లకార్డులతో వస్తున్న తమ పట్ల మార్షల్స్ అనుచితంగా వ్యవహరించారని , వారిపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు, టీడీపీ సభ్యులు చేసిన డిమాండ్ చివరకు వారి మెడకే చుట్టుకుంది. మార్షల్స్ తనను వెనక్కు తోసేశారని… కాబట్టి వారిపై చర్యలు తీసుకోకపోతే తాము అసెంబ్లీకి రావడం కూడా వృధా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దీనికి సమాధానం ఇచ్చిన శాసనసభ వ్యవహారాల ఇన్‌చార్జ్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి… రాజును చంపి పక్కనే నిలబడి గాడ్ సేవ్‌ కింగ్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉందన్నారు. పదేపదే ఎన్టీఆర్‌ పేరును అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావిస్తున్నారని… కానీ ఎన్టీఆర్‌ పార్టీనే లాగేసుకున్న వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. మార్షల్స్‌ పై చంద్రబాబు, టీడీపీ సభ్యులే దాడి చేశారని… ఆ వీడియోలను కూడా ప్రదర్శించేందుకు తాము సిద్ధమని బుగ్గన చెప్పారు. అన్నట్టుగానే అసెంబ్లీలో ఆ వీడియోను ప్రదర్శించారు.

అసెంబ్లీ డోర్ వద్ద మార్షల్స్‌తో గొడవ పడ్డ చంద్రబాబు, టీడీపీ నేతలు… మార్షల్స్‌తో పాటు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మార్షల్స్‌ను తీవ్రంగా హెచ్చరించిన చంద్రబాబు… ముఖ్యమంత్రి ఒక ఉన్మాది, మీరు కూడా ఉన్మాదుల్లాగే ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పలువురు టీడీపీ సభ్యులు కూడా మార్షల్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించిన అనంతరం… ముఖ్యమంత్రిని ఉన్మాది అన్న చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని అధికార పక్షం డిమాండ్ చేసింది. దాంతో సభలో గందరగోళం ఏర్పడింది. 70 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తానంటున్న చంద్రబాబు ప్రవర్తన కూడా చిన్న పిల్లల్లాగే ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు.

First Published:  12 Dec 2019 12:07 AM GMT
Next Story