Telugu Global
CRIME

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్ ఫేక్ అంటూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రెండోరోజు వాదనలు విన్న సుప్రీం కోర్టు… ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కార్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లో ఈ ఎన్‌కౌంటర్‌పై నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కమిషన్‌లో […]

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం
X

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్ ఫేక్ అంటూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

రెండోరోజు వాదనలు విన్న సుప్రీం కోర్టు… ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి వీఎస్ సిర్పుర్కార్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లో ఈ ఎన్‌కౌంటర్‌పై నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ కమిషన్‌లో సభ్యులుగా సీబీఐ మాజీ ఛీప్ కార్తికేయన్‌, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్‌లను నియమించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో కార్తికేయన్‌ దర్యాప్తు అధికారిగా పనిచేశారు.

ఈ కమిషన్‌కు సీఆర్‌పీఎఫ్‌ దళాలు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కమిషన్ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పింది.

ఈ కమిషన్‌ దర్యాప్తు సమయంలో వివరాలను మీడియా ప్రచురించవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లడించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఈ ఎన్‌కౌంటర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని పిటిషనర్‌ వాదించారు. నిందితుల కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలన్న పిటిషనర్‌ వాదనపై మాత్రం సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది.

ఆ నలుగురు చేసిన పనికి కళ్లు మూసుకుని ఉండలేమని వ్యాఖ్యానించింది. చనిపోయిన నిందితులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

First Published:  12 Dec 2019 1:48 AM GMT
Next Story