Telugu Global
NEWS

గొల్లపూడి కన్నుమూత

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గొల్లపూడి వయసు 80 ఏళ్లు. 290కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1939లో ఆయన విజయనగరంలో జన్మించారు. ప్రేమ పుస్తకం చిత్రానికి నంది అవార్డ్ అందుకున్నారు. మొత్తం ఆరు నంది అవార్డులు ఆయనకు దక్కాయి. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డ్ వచ్చింది. 14ఏళ్లకే ఆశాజీవి అన్న కథను రాశారు. జర్నలిస్టుగా ఆయన […]

గొల్లపూడి కన్నుమూత
X

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గొల్లపూడి వయసు 80 ఏళ్లు. 290కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1939లో ఆయన విజయనగరంలో జన్మించారు.

ప్రేమ పుస్తకం చిత్రానికి నంది అవార్డ్ అందుకున్నారు. మొత్తం ఆరు నంది అవార్డులు ఆయనకు దక్కాయి. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డ్ వచ్చింది.

14ఏళ్లకే ఆశాజీవి అన్న కథను రాశారు. జర్నలిస్టుగా ఆయన పని చేశారు. ఆకాశ వాణి లోనూ పని చేశారు. ‘ఆత్మ గౌరవం’ ఆయనకు రచయితగా తొలి చిత్రం. గొల్లపూడి నటించిన ఆఖరి చిత్రం ‘జోడి’.

గొల్ల‌పూడి జీవిత విశేషాలు

  • 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో గొల్లపూడి మారుతీరావు జ‌న్మించారు.
  • గొల్లపూడికి ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్.
  • ప్రేమ పుస్తకం చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చనిపోయిన గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్.
  • చిన్న కుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసిన గొల్లపూడి.
  • తండ్రిబాటలోనే రచనపై ఆసక్తి పెంచుకున్న గొల్లపూడి పెద్దకుమారుడు సుబ్బారావు, రెండో కుమారుడు రామకృష్ణ.
  • గొల్లపూడికి ఐదుగురు మనవరాళ్లు, ఒక మనవడు

సినిమా విశేషాలు

  • రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా గొల్లపూడి మారుతీరావు సుపరిచితులు
  • గొల్లపూడి మారుతీరావు నటించిన తొలి చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య(1982)
  • గొల్లపూడి నటించిన చివరి చిత్రం: జోడి (ఆది సాయికుమార్)
  • 42 ఏళ్ల వయస్సులో మొదటి సినిమాలో నటించిన గొల్లపూడి
  • మూడున్నర దశాబ్దాలకు పైగా సినీరంగంలో ఎన్నో పాత్రలు పోషించిన గొల్లపూడి
  • సుమారు 290కిపైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు
  • ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా మెప్పించిన గొల్లపూడి
  • గొల్లపూడికి గద్దముక్కు పంతులు పేరు పెట్టిన దర్శకుడు కోడిరామకృష్ణ
  • సుందరకాడ చిత్రంలో గొల్లపూడిని సింగిల్ పూరీ శర్మగా మార్చిన రాఘవేందర్ రావు.
  • దాశరథి ప్రోత్సాహంతో సినీ రచయితగా మారిన గొల్లపూడి మారుతీరావు.
  • 1963లో 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రాం ఇచ్చిన మారుతీరావు
  • 14 ఏళ్ల వయస్సులోనే మొదటి కథ ఆశాజీవి రాసిన గొల్లపూడి
  • దుక్కిపాటి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన డాక్టర్ చక్రవర్తికి తొలి సినిమా రచన చేసిన గొల్లపూడి
  • కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరవానికి రచయితగా పనిచేసిన గొల్లపూడి
  • విద్యార్థి దశలోనే నాటకాల్లో నటించిన గొల్లపూడి
  • రాఘవ కళా నికేతన్ పేరుతో నాటక బృందానికి నాయకత్వం వహించిన గొల్లపూడి
  • ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గోపాలస్వామి దర్శకత్వంలో స్నానాలగది నాటకంలో తొలిసారిగా నటించిన గొల్లపూడి
  • 9 నాటకాల్లో నటించిన గొల్లపూడి
  • పలు నాటకాలకు రచన, దర్శకత్వ సహకారం అందించిన గొల్లపూడి
  • ఆత్మగౌరం చిత్రానికి ఉత్తమ కథగా నంది పురస్కారాన్ని అందుకున్న గొల్లపూడి
  • తరంగిణి చిత్రంలో ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్న గొల్లపూడి
  • రామాయణంలో భాగవతం చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అందుకున్న గొల్లపూడి
  • ప్రేమ పుస్తకం చిత్రానికి ఉత్తమ స్క్రీన్ కు నంది పురస్కారం అందుకున్న గొల్లపూడి
  • 1996లో ఉత్తమ టీవీ నటుడిగా నంది పురస్కారాన్ని స్వీకరించిన గొల్లపూడి

గొల్లపూడి రచనలు

  • 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలు
  • జీవన కాలమ్ పేరుతో అనేక వ్యాసాలు రాసిన గొల్లపూడి

గొల్లపూడి నటించిన కొన్ని చిత్రాలు

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, మనిషికో చరిత్ర, తరంగిణి, యముడికి మొగుడు, సంసారం ఒక చందరంగం, స్వాతిముత్యం, స్వాతి, గుఢాచారి నెం.1, ఆలయ శిఖరం, అభిలాష, పల్లెటూరి మొనగాడు ,ఛాలెంజ్, ప్రేమ, ఆదిత్య 369, వజ్రం, మురారి, బ్రోకర్, లీడర్, దరువు, సుకుమారుడు, రౌడీ ఫెలో, కంచె, సైజ్ జీరో, మనమంతా, ఇజం, జోడి…

గొల్లపూడి రచయితగా పనిచేసిన చిత్రాలు

డాక్టర్ చక్రవర్తి, రైతు కుటుంబం, దొరబాబు, ఓ సీత కథ, అన్నదమ్ముల అనుబంధం, శుభలేఖ, కళ్లు….

First Published:  12 Dec 2019 5:02 AM GMT
Next Story