Telugu Global
NEWS

ముంబై టీ-20లో భారత్ ధూమ్ ధామ్ విన్

విండీస్ పై 2-1తో సిరీస్ నెగ్గిన భారత్ టీ-20 విశ్వవిజేత విండీస్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొంది. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన డూ ఆర్ డై మ్యాచ్ లో 5వ ర్యాంకర్ భారత్ 67 పరుగుల భారీ తేడాతో 10వ ర్యాంకర్ విండీస్ ను చిత్తు చేసింది. సిరీస్ నెగ్గాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 […]

ముంబై టీ-20లో భారత్ ధూమ్ ధామ్ విన్
X
  • విండీస్ పై 2-1తో సిరీస్ నెగ్గిన భారత్

టీ-20 విశ్వవిజేత విండీస్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొంది. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన డూ ఆర్ డై మ్యాచ్ లో
5వ ర్యాంకర్ భారత్ 67 పరుగుల భారీ తేడాతో 10వ ర్యాంకర్ విండీస్ ను చిత్తు చేసింది.
సిరీస్ నెగ్గాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీస్కోరు సాధించింది.

భారత ఓపెనర్లు రాహుల్- రోహిత్ పూర్తి స్థాయిలో చెలరేగి ఆడి మొదటి 12 ఓవర్లలోనే మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో భారీస్కోరుకు పునాది వేశారు.

రోహిత్ 34 బాల్స్ లో 71, రాహుల్ 56 బాల్స్ లో 91 పరుగులు సాధించగా …కెప్టెన్ కొహ్లీ కేవలం 29 బాల్స్ లోనే 70 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

విండీస్ కు చెక్…

241 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్…20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ కీరన్ పోలార్డ్ 39 బాల్స్ లో 5 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 68 పరుగుల స్కోరుతో ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

విండీస్ తో ఇప్పటి వరకూ ఆడిన 16 టీ-20ల్లో భారత్ కు ఇది 10వ విజయం కావడం విశేషం.

First Published:  11 Dec 2019 8:01 PM GMT
Next Story