మరో సినిమా స్టార్ట్ చేసిన సూపర్ స్టార్

ఓవైపు పొలిటికల్ పార్టీ పెట్టినా సినిమాల విషయంలో జోరు తగ్గించలేదు రజనీకాంత్. ఓ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. ఇందులో భాగంగా మొన్ననే దర్బార్ సినిమా షూటింగ్ పూర్తిచేసిన రజనీకాంత్, ఈరోజు మరో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రాబోతున్న సినిమాకు ఈరోజు చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

దర్బార్ లో మాస్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు రజనీకాంత్. ఇది పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. శివ దర్శకత్వంలో చేయబోతున్న మూవీలో మాత్రం పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు సూపర్ స్టార్. పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేయబోతున్నాడు. కెరీర్ లో రజనీకాంత్ కు ఇది 168వ చిత్రం.

ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇక రెండు కీలక పాత్రల కోసం ఖష్బూ, మీనాను తీసుకున్నారు. గతంలో వీళ్లిద్దరూ రజనీకాంత్ సరసన హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు అతడు హీరోగా చేస్తున్న సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపించబోతున్నారు.