Telugu Global
Others

విద్యార్జనలో అసమానతలు వినాశకరం

ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల తీరులో మార్పులు వస్తున్నందువల్ల అనేక రంగాల్లో ముఖ్యంగా విద్యా రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ అవకాశాలు పెరిగినందువల్ల భారత విద్యార్థులు వివిధ దేశాల్లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో, సమర్థులైన అధ్యాపకులు బోధించే చోట చదువుకోగలుగుతున్నారు. అదే విధంగా మన దేశంలో కూడా సమర్థులైన అధ్యాపకులను నియమించుకునే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా పెరుగుతున్నాయి. ఉన్నత విద్యకు అవకాశాలు పెరుగుతున్నప్పటికి కొన్ని వర్గాల వారికి ఆ అవకాశం దక్కడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా అవకాశాలు పెరుగుతున్న రీతిలోనే […]

విద్యార్జనలో అసమానతలు వినాశకరం
X

ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల తీరులో మార్పులు వస్తున్నందువల్ల అనేక రంగాల్లో ముఖ్యంగా విద్యా రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ అవకాశాలు పెరిగినందువల్ల భారత విద్యార్థులు వివిధ దేశాల్లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో, సమర్థులైన అధ్యాపకులు బోధించే చోట చదువుకోగలుగుతున్నారు. అదే విధంగా మన దేశంలో కూడా సమర్థులైన అధ్యాపకులను నియమించుకునే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా పెరుగుతున్నాయి.

ఉన్నత విద్యకు అవకాశాలు పెరుగుతున్నప్పటికి కొన్ని వర్గాల వారికి ఆ అవకాశం దక్కడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా అవకాశాలు పెరుగుతున్న రీతిలోనే కొందరికి అవకాశాలు దక్కని స్థితి సైతం పెరుగుతోంది.

చదువుకోవాలన్న కోరిక ఉన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరడానికి అవకాశాలు కొరవడడంవల్ల సమాజంలో అసమానతలు పెరుగుతాయి. ఉన్నత విద్య అభ్యసించాలంటే దానికి కావలసిన ఖర్చులూ భరించాల్సి వస్తుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఈ ఖర్చు మరింత ఎక్కువ ఉండవచ్చు.

విద్యా రంగంలో అసమానతలు అపారం కనక ప్రభుత్వ అధీనంలోని విశ్వవిద్యాలయాలు ఆ అవకాశం కల్పించాలి. అందుకే అవకాశాలు తక్కువగా ఉండే వారు సైతం ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే విధానం అమలులోకి వచ్చింది.

అణగారిన వర్గాల వారికి సహజంగానే అవకాశాలు తక్కువ ఉంటాయి గనక అలాంటి సహాయం అందించడం ప్రభుత్వం నైతిక బాధ్యత కూడా. తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను తీర్చడంతో పాటు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిన అణగారిన వర్గాల విద్యార్థులు సృజనాత్మకంగా వ్యవహరించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఉన్నత విద్య యథతథవాద, తిరోగమన భావాలకు చోటివ్వకుండా ఉండాలి.

అణగారిన వర్గాల వారికి అవకాశం లేకుండా పోతే వారి సృజనాత్మకత వెలికి వచ్చే వీలుండదు. అణగారిన వర్గాల వారు ఉన్నత విద్య అభ్యసించిన తరవాత తమ నైతిక బాధ్యతను విస్మరించకూడదు. అంటే వారు తాము సంపాదించిన జ్ఞానాన్ని సమాజాభ్యుదయానికి వినియోగించాలి. ఈ పని చేయాలంటే అణగారిన వర్గాలు చెల్లించవలసిన ఫీజు వారికి అందుబాటులో ఉండాలి.

ఈ ఫీజు అందుబాటులో ఉండడం అవసరమే కానీ అది మాత్రమే సరిపోదు. కేవలం ఫీజు తక్కువగా ఉన్నందువల్ల ఏ విద్యార్థీ సంపూర్ణమైన విద్యార్థి కావడం కుదరదు. తమ మేధా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందింప చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న పరిస్థితి కొన్ని వర్గాల విద్యార్థులు ఈ లక్ష్యాలు సాధించడానికి అనువుగా ఉండదు. ఎందుకంటే విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఉండవు. అందువల్ల విద్యార్థులు తమ శక్తి మేరకు జ్ఞానం సంపాదించే అవకాశం ఉండదు. కొన్ని సార్లు ఇలాంటి విద్యార్థులు చదువు వదిలేయాల్సిన పరిస్థితీ తలెత్తవచ్చు. వారికి అనేక అవాంతరాలు ఎదురవుతాయి.

న్యాయ కళాశాలలు, ఐ.ఐ.టి.లు, ఐ.ఐ.ఎం.లలో షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఇది అసమానతలకు నిదర్శనం. విద్యార్థుల మేధా శక్తిని అభినందించలేని స్థితి ఉంటే వారిలో ఉన్న సృజనాత్మకత కూడా నశిస్తుంది. కొంత మంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఒంటరితనం లేదా ఏదో ఒక రకంగా వెలికి గురి కావడం తీవ్రమైన అసమానతలకు దారి తీస్తుంది. ఎందుకంటే ఇది కిరాతకమైంది.

విశ్వ విద్యాలయాల ప్రాంగణాలలో కులం ఆధారంగా, జాతి ఆధారంగా సమూహాలు ఏర్పడుతున్నాయి. జ్ఞానం అందజేసే విశ్వ విద్యాలయాలు కుల, మత, జాతి వివక్షకు దూరంగా ఉండాలి. విశ్వ విద్యాలయాలు జ్ఞానాన్ని పెంపొందించే కేంద్రాలుగా ఉంటే విద్యార్థుల దృక్కోణం వికసిస్తుంది. ఈ విద్యార్థులలో సరైన దృక్పథం అంతర్నిహితంగా ఉంటుంది.

ఎస్.సి., ఎస్.టి. విద్యార్థులు ఇతర విద్యార్థులతో సమానంగా వ్యవహరించలేని పరిస్థితులు తారస పడ్తున్నాయి. వారు దళిత విద్యార్థులుగానే ఉండిపోతున్నారు. కొందరికి ప్రాధాన్యత ఇవ్వడంవల్ల వీరికి అననుకూలంగా తయారవుతుంది. ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రావడం రాజకీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం. అది ఫీజులు నిర్ణయానికి సంబంధించింది. అంతే కాదు ఇది నైతిక ప్రవర్తనకు సంబంధించింది కూడా.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  11 Dec 2019 9:25 PM GMT
Next Story