వంశీ సీక్రెట్లను అందిస్తున్నారా?

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరు టీడీపీకి చికాకు తెప్పిస్తోంది. ఆయన బొమ్మ కనిపించినా టీడీపీ వారు రగిలిపోతున్నారు. పైగా చంద్రబాబు లేచి నిలబడి ప్రసంగించే సమయంలో కెమెరా ప్రేమ్‌లో కనిపించేలా వంశీ సీటు ఉంది.

దాంతో చంద్రబాబును చూసినప్పుడల్లా వంశీని టీడీపీ వారు చూడాల్సి వస్తోంది. దీనికి తోడు తమ గుట్టును అధికార పార్టీకి వంశీ అందిస్తున్నారని టీడీపీ తాజాగా మండిపడుతోంది.

టీడీపీ గుట్లు తెలిసిన వంశీ వాటిని అధికార పార్టీ సభ్యులకు స్లిప్పుల రూపంలో అందిస్తూ టీడీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

అంబటి రాంబాబు మాట్లాడుతున్న సమయంలో వంశీ పలుమార్లు స్లిప్పులు రాసి ఆయనకు పంపించారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వంశీని స్పీకర్ ప్రత్యేక సభ్యుడిగా గుర్తించారు. దాంతో వంశీ సభలోనూ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు.