స్వదేశీగడ్డపై 1000 టీ-20 పరుగుల విరాట్

  • విండీస్ తో ఆఖరి టీ-20లో కొహ్లీ వీరవిహారం

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సైతం తన బ్యాట్ పవర్ ఏపాటిదో చాటుకొన్నాడు. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన ఆఖరి టీ-20లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించాడు.

కేవలం 20 బాల్స్ లోనే 70 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా…భారత గడ్డపై వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. కొహ్లీ 7 సిక్సర్లు, 4 బౌండ్రీలతో పరుగుల వర్షం కురిపించాడు.

స్వదేశీగడ్డపై టీ-20 క్రికెట్లో ఇప్పటి కే వెయ్యి పరుగుల రికార్డు పూర్తి చేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, కోలిన్ మున్రోల తర్వాతి స్థానంలో విరాట్ కొహ్లీ నిలిచాడు.

ప్రస్తుత విండీస్ సిరీస్ వరకూ…75 మ్యాచ్ లు ఆడిన విరాట్ కొహ్లీ 24 హాఫ్ సెంచరీలతో 2వేల 633 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ రోహిత్ శర్మ పేరుతో ఉన్న2వేల 633 పరుగుల రికార్డును సమం చేయగలిగాడు.