Telugu Global
NEWS

ఏసీబీకి దొరికిన 100 కోట్ల క‌రెంట్ అవినీతి తిమింగ‌ళం !

హైద‌రాబాద్‌లో భారీ అవినీతి చేప దొరికింది. విద్యుత్ శాఖ‌లో డీఈగా ప‌నిచేస్తున్న ముత్యం వెంక‌ట‌ర‌మ‌ణ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. క‌రెంట్ క‌నెక్ష‌న్ కోసం 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. దీంతో ఆయ‌న ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేస్తే భారీగా ఆస్తులు, న‌గ‌దు, బంగారం బ‌య‌ట‌ప‌డింది. ముత్యం వెంక‌ట‌ర‌మ‌ణ మాదాపూర్ లోని మీనాక్షి స్కై లాంజ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. దీంతో ఆయ‌న‌ ఫ్లాట్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ సోదాల్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారు […]

ఏసీబీకి దొరికిన 100 కోట్ల క‌రెంట్ అవినీతి తిమింగ‌ళం !
X

హైద‌రాబాద్‌లో భారీ అవినీతి చేప దొరికింది. విద్యుత్ శాఖ‌లో డీఈగా ప‌నిచేస్తున్న ముత్యం వెంక‌ట‌ర‌మ‌ణ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. క‌రెంట్ క‌నెక్ష‌న్ కోసం 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. దీంతో ఆయ‌న ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేస్తే భారీగా ఆస్తులు, న‌గ‌దు, బంగారం బ‌య‌ట‌ప‌డింది.

ముత్యం వెంక‌ట‌ర‌మ‌ణ మాదాపూర్ లోని మీనాక్షి స్కై లాంజ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. దీంతో ఆయ‌న‌ ఫ్లాట్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ సోదాల్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారు ఆభరణాలు చూసి ఏసీబీ అధికారులు షాక్‌కు గుర‌య్యారు.

1. రెండు కోట్ల 93 లక్షల 6వేల విలువైన భూముల‌ డాక్యుమెంట్స్. మార్కెట్ విలువ ప్ర‌కారం 20 నుంచి 50 కోట్ల మ‌ధ్య వీటి విలువ ఉంటుంద‌ని అంచ‌నా.

2. 26లక్షల 40 వేల నగదు దొరికింది. ఇవ‌న్నీ రెండు వేలు, ఐదు వంద‌ల నోట్లే.

3. 60 తులాల బంగారం, వెండి ఆభరణాలు, 8 విలువైన గడియారాలు, 5 డిజిటల్ కెమెరాలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ అధికారులు ఆస్తుల‌తో పాటు న‌గ‌దు, బంగారం విలువ వేస్తున్నారు. మొత్తం విలువ వంద‌కోట్లు ఉంటుంద‌ని ప్రాథ‌మిక అంచ‌నా.

First Published:  12 Dec 2019 9:17 PM GMT
Next Story