Telugu Global
NEWS

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ సస్పెన్ష‌న్ !

వైసీపీ స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత తొలి వేటు ప‌డింది. అవినీతికి పాల్ప‌డుతున్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. కేంద్ర స‌ర్వీసుల్లో జాస్తి కిషోర్ డిప్యూటేషన్ మీద ఏపీకి వ‌చ్చారు. గ‌త ఐదేళ్లు ఆర్ధికాభివృద్ధి మండ‌లి బోర్డు సీఈవోగా ఉన్నారు. ఈ బోర్డులో త‌న టీమ్‌ను ఏర్పాటు చేసుకుని అడ్డ‌గోలుగా భూ కేటాయింపులు, నిధుల దుర్వినియోగం చేశార‌ని జాస్తి కిషోర్‌ పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బోర్డులో ఉద్యోగ నియ‌మాకాల‌తో పాటు అవినీతి ప‌నుల‌కు సెంట‌ర్ పాయింట్‌గా […]

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ సస్పెన్ష‌న్ !
X

వైసీపీ స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత తొలి వేటు ప‌డింది. అవినీతికి పాల్ప‌డుతున్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. కేంద్ర స‌ర్వీసుల్లో జాస్తి కిషోర్ డిప్యూటేషన్ మీద ఏపీకి వ‌చ్చారు. గ‌త ఐదేళ్లు ఆర్ధికాభివృద్ధి మండ‌లి బోర్డు సీఈవోగా ఉన్నారు. ఈ బోర్డులో త‌న టీమ్‌ను ఏర్పాటు చేసుకుని అడ్డ‌గోలుగా భూ కేటాయింపులు, నిధుల దుర్వినియోగం చేశార‌ని జాస్తి కిషోర్‌ పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

బోర్డులో ఉద్యోగ నియ‌మాకాల‌తో పాటు అవినీతి ప‌నుల‌కు సెంట‌ర్ పాయింట్‌గా జాస్తి కిషోర్ ఉన్నారు. ఈయ‌న అక్ర‌మాల‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావ‌డంతో ప్ర‌భుత్వం సస్పెండ్ చేసింది. అత‌నిపై కేసులు న‌మోదు చేయాల‌ని సీఐడీ, ఏసీబీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లో ఈయ‌న‌పై విచారణను పూర్తి చెయ్యాలని ఆదేశించింది. ఇదే సమయంలో అమరావతి వదిలి వెళ్లకూడదని జాస్తిని ఆదేశించింది.

పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. గత ప్రభుత్వంలో వైజాగ్‌లో పెట్టుబ‌డుల ఎంవోఈల‌కు అస‌లు క‌ర్త ఈయ‌నే. పేప‌ర్ల మీద పెట్టుబడులు చూపించి భూములు కొట్టేయ‌డంలో ఈయ‌న చాలా నేర్ప‌రి. హైద‌రాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి ఈయ‌న ఎక్కువ‌గా కార్య‌క‌ల‌పాలు నిర్వ‌హించేవారు.

మ‌రోవైపు సచివాలయంలో సస్పెండ్ అయిన ఇద్దరు సాధారణ పరిపాలన శాఖ అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జయరాం,సెక్షన్ ఆఫీసర్ అచ్చయ్య లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి బదిలీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రభుత్వం అప్ప‌ట్లో వీరిని సస్పెండ్ చేసింది.

అయితే పని ఒత్తిడి వల్ల తప్పు జరిగిందని భవిష్యత్తు లో పొరపాటు జరగదని ఇద్దరు అధికారులు వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన ప్ర‌భుత్వం వారికి తిరిగి పోస్టింగ్ ఇచ్చింది.

First Published:  12 Dec 2019 9:19 PM GMT
Next Story