Telugu Global
National

సంస్కృతం మాట్లాడితే షుగర్ రాదు... మరో బీజేపీ ఆణిముత్యం

బీజేపీ నేతలు తమకు నచ్చిన అంశాలను జనం మీదకు రుద్ధేందుకు ఎలాంటి ప్రచారమయినా చేస్తున్నారు. ఆవు ఆక్సిజన్ విడుదల చేస్తుందని ఆ మధ్య ఒక నేత సెలవిచ్చి అందరినీ ఖంగు తినిపించారు. మరో బీజేపీ మంత్రి ఈ మధ్యే కోడిగుడ్డు పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్ లో కోడిగుడ్డు ఇవ్వవద్దు అంటూ డిమాండ్ చేశారు. మరో బీజేపీ నేత కోడి మాంసం తినడం మంచిది కాదు అంటారు. మరో బీజేపీ గవర్నర్ ఇటీవల ఏకంగా […]

సంస్కృతం మాట్లాడితే షుగర్ రాదు... మరో బీజేపీ ఆణిముత్యం
X

బీజేపీ నేతలు తమకు నచ్చిన అంశాలను జనం మీదకు రుద్ధేందుకు ఎలాంటి ప్రచారమయినా చేస్తున్నారు. ఆవు ఆక్సిజన్ విడుదల చేస్తుందని ఆ మధ్య ఒక నేత సెలవిచ్చి అందరినీ ఖంగు తినిపించారు.

మరో బీజేపీ మంత్రి ఈ మధ్యే కోడిగుడ్డు పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్ లో కోడిగుడ్డు ఇవ్వవద్దు అంటూ డిమాండ్ చేశారు.

మరో బీజేపీ నేత కోడి మాంసం తినడం మంచిది కాదు అంటారు.

మరో బీజేపీ గవర్నర్ ఇటీవల ఏకంగా రాజ్ భవన్ లో మాంసాహారం పై బ్యాన్ విధించి వార్తల్లోకి ఎక్కాడు.

తాజాగా మరో బీజేపీ ఎంపీ ఈ జాబితాలో చేరారు. ఆయన తనకు ఇష్టమైన భాషను జనాల మీద రుద్ధేందుకు కొత్త అంశం చెప్పారు. అందరూ సంస్కృతం నేర్చుకోవాలని సూచించారు. మధ్యప్రదేశ్ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ సంస్కృతంలో మాట్లాడితే షుగర్ వ్యాధి రాదంటూ సెలవిచ్చారు.

సంస్కృతంలో మాట్లాడితే కొవ్వు నియంత్రణలో ఉంటుందని చెప్పారు. సొంతంగా చెబితే జనం నమ్మరు కాబట్టి అమెరికాలో చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం తేలింది అంటూ చెప్పుకొచ్చారు.

లోక్‌సభలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాలు – 2019 బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో మధ్యప్రదేశ్ సాట్నా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రతీ రోజు సంస్కృతం మాట్లాడటం ద్వారా మనలోని నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుందని.. తద్వారా మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా కొవ్వు పెరగకుండా ఉంటుందని ఆయన చెప్పారు. అంతే కాకుండా ప్రపంచంలోని 97 శాతం భాషలు సంస్కృతం నుంచే పుట్టాయని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా.. కంప్యూటర్ల ప్రోగ్రామింగ్‌లో సంస్కృత భాష వాడటం వల్ల అవి క్రాష్ అవకుండా నిరంతరం పని చేస్తాయని చెప్పిందని గణేష్ లోక్‌సభకు వెల్లడించారు. కంప్యూటర్లకు సంస్కృతానికి మించిన భాష లేదని ఆయన ధృవీకరించారు.

గణేష్ సింగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. దేశాన్ని వెనక్కు తీసుకెళ్లే పనిలో బీజేపీ నేతలు చాలా వేగంగా పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

First Published:  13 Dec 2019 11:17 AM GMT
Next Story