చైతూ నా ఫేవరెట్ కిడ్

నాగచైతన్యపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు వెంకటేశ్. వెంకీమామ రిలీజ్ సందర్భంగా  మీడియాతో మాట్లాడిన వెంకటేశ్.. తమ కుటుంబంలో అందరికంటే ముద్దుగా, అందంగా ఉండేది చైతూ మాత్రమే అంటున్నాడు.

“చైతు ఎప్పుడైనా నా ఫేవరెట్ కిడ్. చిన్నపుడు వాడిని హగ్ చేసుకోవడానికే ఫైట్ చేసేవాళ్ళం. అంత సాలిడ్ గా, క్యూట్ గా ఉండేవాడు. ఇంత తొందరగా యాక్టింగ్ నేర్చుకోవడం, నాతో కలిసి నటించడం థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే నాలాగే తనకి, రానాకీ కూడా యాక్టింగ్ లోకి రావాలని కోరిక లేదు. కానీ వచ్చేశాం. ప్రేక్షకులు మమ్మల్ని యాక్సప్ట్ చేశారు. మంచి సినిమా ఇచ్చిన ప్రతి సారి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. చైతు కూడా చాలా నేర్చుకొని ఇండస్ట్రీ కి వచ్చాడు”

ఇక తన అప్ కమింగ్ మూవీ గురించి మాట్లాడుతూ.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రెండోసారి నటించబోతున్నానని, అసరున్ సినిమా చాలా కొత్తగా ఉంటుందని తెలిపాడు. జనవరి నుంచి షూటింగ్ ఉంటుందని స్పష్టంచేశాడు.

“శ్రీకాంత్ అడ్డాల ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు. బేసిగ్గా హార్డ్ వర్కర్. నేను కూడా ఇంతకు ముందు తనతో పని చేసి ఉన్నాను కాబట్టి మా ఇద్దరికీ మంచి రిలేషన్ షిప్ ఉంది. ‘సీతమ్మ వాకిట్లో.. ‘ తరవాత కూడా ఓ రెండు స్క్రిప్ట్స్ చెప్పాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ మా ఇద్దరికీ కుదిరింది. మరో చాలెంజింగ్ సినిమా జనవరి నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది.”