మహ్మద్ అసాద్ తో ఆనమ్ మీర్జా నిఖా

  • అజార్ కోడలైన సానియా సోదరి

భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ కుటుంబాలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి.

హైదరాబాద్ లో గురువారం సాంప్రదాయబద్దంగా జరిగిన నిఖా వేడుకల్లో అజరుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్ తో సానియా సోదరి ఆనమ్ మీర్జా వివాహబంధంతో ఒక్కటయ్యారు.

ఈ వివాహానికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్, ఇతర మంత్రులు, హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

గత రెండురోజులుగా జరిగిన పలు రకాల వేడుకల తర్వాత నిఖా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

గత నెలలోనే ఈ రెండు కుటుంబాలు కలసి నిశ్ఛితార్థం వేడుకలను ముగించాయి. ఈనెల మూడో వారంలో జరిగే ఈ వివాహానికి ముందే సానియా సోదరి ఆనమ్ తన స్నేహితులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది.

ఈ విందులో భాగంగా వధువు అలంకరణ ఫోటోలను, వీడియోలను విడుదుల చేసింది. ఆనమ్ తన సోదరి సానియాతో కలసి స్నేహితురాళ్ల బృందంతో దిగిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో ఉంచింది.

ఆనమ్ మీర్జా ఫోటోలకు ఇన్ స్టాగ్రామ్ లో ఉంచిన ఫోటోలకు విపరీతమైన లైక్ లు వచ్చాయి. మహ్మద్ అసదుద్దీన్ సైతం ఆనమ్ మీర్జాతో కలసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

సానియా సోదరి ఆనమ్ కు గతంలోనే వివాహమయ్యింది. అయితే… విభేదాలతో భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న ఆనమ్ ఇప్పుడు అజార్ కుమారుడిని నిఖా చేసుకోడం ద్వారా తన వివాహ జీవితాన్ని తిరిగి ప్రారంభించగలిగింది.