సెట్స్ పైకొచ్చిన గోపీచంద్ సినిమా

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఈ సినిమా వస్తోంది.

పక్కా మాస్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తుంది. వీళ్లిద్దరికీ గోపీచంద్ సరసన నటించడం ఇదే ఫస్ట్ టైమ్.

మొదటి షెడ్యూల్ గా అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మొదటి షెడ్యూల్ తర్వాత, అదే ఊపులో కంటిన్యూగా రాజమండ్రి, ఢిల్లీ షెడ్యూల్స్ పూర్తి చేసి వచ్చే సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్.

మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. భూమిక, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలింగా రాబోతోంది. కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం సంపత్‌ నంది.