నాకు అప్పుడే పెళ్లేంటి?

మరోసారి తన పెళ్లిపై స్పందించింది కాజల్. అప్పుడే తనకు పెళ్లేంటి అంటూ నవ్వేసి ఊరుకుంది. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి విజయవాడ వెళ్లిన కాజల్.. అక్కడకొచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించింది.

ఫ్యాన్స్ అంతా పెళ్లి..పెళ్లి అంటూ గట్టిగా అరవడంతో.. కాజల్ కూడా గట్టిగా నవ్వేసింది. అప్పుడే పెళ్లేంటి అంటూ తప్పించుకుంది.

ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో ఉందంటూ కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా పెళ్లి అంటూ గట్టిగా అరవడం, కాజల్ వాటిని ఖండించడం చకచకా జరిగిపోయాయి. 2 రోజుల కిందట
ఓ వెబ్ మీడియాతో మాట్లాడుతూ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది కాజల్.

పెళ్లి చేసుకొని కూడా కెరీర్ కొనసాగించవచ్చు కదా, ప్రస్తుతం సమంత అలానే చేస్తోంది కదా అంటూ యాంకర్ అడగ్గా.. ఈ విషయంలో ఎవరి నిర్ణయాలు వాళ్లకుంటాయని తేల్చిచెప్పేసింది కాజల్. సమంత పెళ్లి చేసుకొని కెరీర్ కొనసాగిస్తోందని, తనను కూడా పెళ్లి చేసుకోమని అడగడం ఏం బాగాలేదంటూ సున్నితంగా చురకలు అంటించింది.

అయినా తన పెళ్లికి ఇంకా టైమ్ ఉందని, కాలం ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటానంటోంది ఈ చందమామ.