Telugu Global
National

కేసీఆర్ ను దించడం మోడీ వల్ల అవుతుందా?

సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఆరితేరిన రాజకీయ వ్యూహకర్త కేసీఆర్. తెలంగాణలో ప్రతిపక్షాన్ని తుత్తునియలు చేయడం.. ప్రత్యర్థులు, మీడియా, రాజకీయ దురంధరులు కూడా ఊహించని విధంగా వ్యూహాలు రచించడంలో కేసీఆర్ ఆరితేరారు. ఆర్టీసీ సమ్మె, దిశ ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ వ్యూహ చతురతకు అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి కేసీఆర్ ని వచ్చేసారి దించేసి బీజేపీని గద్దెనెక్కిస్తానని ప్రధాని మోడీ నిన్న తనను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలతో అనేశారు. మరి సాధ్యమవుతుందా? అంటే సమాధానం చెప్పలేని […]

కేసీఆర్ ను దించడం మోడీ వల్ల అవుతుందా?
X

సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఆరితేరిన రాజకీయ వ్యూహకర్త కేసీఆర్. తెలంగాణలో ప్రతిపక్షాన్ని తుత్తునియలు చేయడం.. ప్రత్యర్థులు, మీడియా, రాజకీయ దురంధరులు కూడా ఊహించని విధంగా వ్యూహాలు రచించడంలో కేసీఆర్ ఆరితేరారు. ఆర్టీసీ సమ్మె, దిశ ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ వ్యూహ చతురతకు అందరూ షాక్ అయ్యారు.

ఇలాంటి కేసీఆర్ ని వచ్చేసారి దించేసి బీజేపీని గద్దెనెక్కిస్తానని ప్రధాని మోడీ నిన్న తనను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలతో అనేశారు. మరి సాధ్యమవుతుందా? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

కేంద్రాన్ని ఒప్పించి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలపై మొదట పోటీ పెట్టలేదు. చివరి వరకూ నాన్చి లక్ష్మణ్, కిషన్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపిస్తారని అనుకున్నారు. కానీ వారిపై గులాబీ నేతలను దించారు. అయితే తెలంగాణలో బీజేపీ ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. ఇలా కేసీఆర్ ఎత్తులకు చిత్తైన బీజేపీ స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని కూడా గెలిపించుకోలేని దుస్థితికి దిగజారింది.

కేసీఆర్ వ్యూహాలను అర్థం చేసుకోలేక ఆయనకు మద్దతు పలికిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు సంపాదించి షాకిచ్చింది. అయితే జనాలు మోడీని చూసి జాతీయ కోణంలోనే వారిని గెలిపించారు. ఆ తర్వాత జడ్పీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది.

ఇలా కేసీఆర్ ముందు బీజేపీ పప్పులు తెలంగాణలో ఉడకలేదు. పైగా క్షేత్రస్థాయిలో బలం లేని.. కార్యకర్తలు, నేతలు లేని బీజేపీ వచ్చేసారి తెలంగాణలో అధికారంలోకి వస్తుందనుకుంటే పొరపాటే.

ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్న నేతలతోనే తెలంగాణలో బీజేపీ రాజకీయం చేస్తోంది. నిజంగా పూర్తి స్థాయిలో పార్టీని నడిపించే నాయకుడు లేడు. దీంతో వచ్చేసారి అధికారంలోకి వస్తామన్న మోడీ మాట నెరవేరుతుందా లేదా అన్నది వేచిచూడాలి.

First Published:  14 Dec 2019 1:10 AM GMT
Next Story