Telugu Global
NEWS

ఆ కేంద్రమంత్రి భార్య పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారా?

తెలంగాణ లో మద్యాన్ని నిషేధించాలని బీజేపీ నేత డీకే అరుణ మహిళ సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ నేత‌లు ప‌లువురు హాజ‌ర‌య్యారు. రెండు రోజుల పాటు వివిధ విభాగాల పార్టీ నేత‌లు వ‌చ్చి సంఘీభావం ప్ర‌క‌టించారు. చివ‌రి రోజు ప‌రిపూర్ణానందా వ‌చ్చి నిమ్మ‌రసం ఇచ్చారు. డీకే అరుణ దీక్ష విర‌మించారు. అయితే ఈ దీక్ష రెండో రోజు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్య‌రెడ్డి వ‌చ్చారు. ఆమె ఎందుకు వ‌చ్చారు? […]

ఆ కేంద్రమంత్రి భార్య పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారా?
X

తెలంగాణ లో మద్యాన్ని నిషేధించాలని బీజేపీ నేత డీకే అరుణ మహిళ సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ నేత‌లు ప‌లువురు హాజ‌ర‌య్యారు. రెండు రోజుల పాటు వివిధ విభాగాల పార్టీ నేత‌లు వ‌చ్చి సంఘీభావం ప్ర‌క‌టించారు. చివ‌రి రోజు ప‌రిపూర్ణానందా వ‌చ్చి నిమ్మ‌రసం ఇచ్చారు. డీకే అరుణ దీక్ష విర‌మించారు.

అయితే ఈ దీక్ష రెండో రోజు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్య‌రెడ్డి వ‌చ్చారు. ఆమె ఎందుకు వ‌చ్చారు? అనేది ఇప్పుడు బీజేపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కావ్య‌రెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారా? అనే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

మొన్న‌టివ‌ర‌కు ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఎక్క‌డా క‌నిపించేవారు కాదు. త‌న భ‌ర్త త‌ర‌పున కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్ర‌మే పాల్గొనేవారు. ఆ త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించేవారు కాదు. ఏదో ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మంలో భ‌ర్త‌తో పాటు పాల్గొనేవారు. ఎక్కువ‌గా బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకునేవారు. కానీ డీకే అరుణ దీక్ష శిబిరంలో ఆమె స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె రాజ‌కీయంగా కూడా యాక్టివ్ అవుతార‌నే ప్ర‌చారం వినిపిస్తోంది.

ఎన్న‌డూ రాజకీయ కార్యక్రమాలకు రాని కావ్య… డీకే అరుణ నిరాహార దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. కేంద్రమంత్రి హోదాలో కిష‌న్‌రెడ్డి బీజీగా ఉన్నారు. ఆయ‌న డీకే దీక్ష‌కు రాలేక‌పోయారు. దీంతో ఆయ‌న ప్లేస్ లో వ‌చ్చి అరుణ‌కు సంఘీభావం తెలిపార‌ని కొంద‌రు అంటున్నారు.

కానీ ఇంత‌కుముందు చాలా సార్లు కిష‌న్‌రెడ్డి కొన్ని కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కాలేదు. కానీ ఆరోజు కావ్యరెడ్డి రాలేదు. ఇప్పుడు డీకే దీక్ష‌కు రావ‌డం మాత్రం ఆస‌క్తిక‌రంగామారింది.

కిష‌న్‌రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా అక్క‌డి నుంచి పోటీ చేయ‌బోతున్నారు. దీంతో అంబ‌ర్‌పేట ఎమ్మెల్యేగా కావ్య పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఆమె రాజ‌కీయాల్లోకి రావొచ్చ‌ని తెలుస్తోంది .

First Published:  13 Dec 2019 8:44 PM GMT
Next Story