మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు మొదలైంది

పొన్నియన్ సెల్వమ్.. మణిరత్నం కలల ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని దాదాపు 15 ఏళ్లుగా పరితపిస్తున్నాడు ఈ దర్శక దిగ్గజం. కానీ ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు తన కలల ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొచ్చాడు మణిరత్నం.

పొన్నియన్ సెల్వమ్ సినిమా షూటింగ్ దట్టమైన థాయిలాండ్ అడవుల్లో ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్ లో కార్తిపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమాలో కార్తీతో పాటు విక్రమ్, త్రిష, జయం రవి, ఐశ్వర్యరాయ్, విక్రమ్ ప్రభు, మోహన్ బాబు లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

పొన్నియన్ సెల్వమ్ పేరు చెప్పగానే ఎవరికైనా మహేష్ బాబు గుర్తొస్తాడు. అవును.. ఈ సినిమాను మహేష్ హీరోగా చేయాలని మణిరత్నం భావించాడు. దాదాపు ఏడేళ్ల కిందటే మహేష్ కు ఈ కథ చెప్పాడు. అప్పుడే మహేష్ ఈ సినిమా చేసి ఉంటే.. బాహుబలి రేంజ్ హిట్ అయి ఉండేదని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఎందుకో మహేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

అప్పట్నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ అటుఇటుగా 150 కోట్ల రూపాయలు.