ఆ లిస్ట్ లో సాహోకు మాత్రమే స్థానం

ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది సాహో సినిమా. ఇప్పుడీ సినిమా పేరిట మరో మంచి రికార్డు నమోదైంది. ప్రతి ఏటా ఉత్తమ చిత్రాల్ని ప్రకటించే IMDB సంస్థ, ఈ ఏడాది తమ టాప్-10 జాబితాలో సాహోకు స్థానం కల్పించింది. అత్యధికంగా ఓట్లు సాధించిన టాప్-10 చిత్రాల జాబితాలో సాహోకు 9వ స్థానం దక్కింది.

సాహో మినహా మరే ఇతర దక్షిణాది మూవీకి టాప్-10లో స్థానం దక్కలేదు. బాలీవుడ్ లో సాహో పెద్ద హిట్ అయింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బాలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. IMDB టాప్-10లో ప్రభాస్ సినిమాకు చోటు దక్కడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నాడు విశ్లేషకులు. రజనీకాంత్ నటించిన పేట సినిమాకు మాత్రం లిస్ట్ లో 14వ స్థానం దక్కింది.

IMDB టాప్-10 చిత్రాలివే (నమోదైన ఓట్ల పరంగా)
1. యూరీ
2. గల్లీ బాయ్
3. కబీర్ సింగ్
4. భారత్
5. బద్లా
6. సూపర్ 30
7. ఆర్టికల్ 15
8. చిచోరే
9. సాహో
10. వార్