వెంకీ మామ మొదటి రోజు వసూళ్లు

వెంకటేష్, నాగచైతన్య నటించిన వెంకీమామ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలైంది. భారీ స్థాయిలో థియేటర్లు దొరకడంతో పాటు, ప్రచారంతో హోరెత్తించడంతో మొదటి రోజు ఈ సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. నిన్న రిలీజైన ఈ సినిమాకు ఏపీ, నైజాంలో కలిపి 6 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అటు వెంకటేశ్, ఇటు నాగచైతన్య కెరీర్ లో మొదటి రోజు అత్యథిక వసూళ్ల రికార్డు ఇదే. ఇంతకుముందు శైలజారెడ్డి అల్లుడు నాగచైతన్య కెరీర్ లో, బాబుబంగారం సినిమా వెంకీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్స్ గా ఉండేవి. ఇప్పుడా రెండు రికార్డులు వెంకీమామ రాకతో తుడిచిపెట్టుకుపోయాయి.

అయితే మొదటి రోజు వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ, ఈ సినిమా హిట్టా లేక ఫ్లాపా అనే విషయం త్వరలోనే తేలుతుంది. ఎందుకంటే ఈ సినిమాకు హిట్ టాక్ రాలేదు. శని, ఆదివారాలు సినిమా ఊపందుకుంటే ఓకే. లేదంటే మాత్రం సోమవారం నుంచి దీనికి నష్టాలు తప్పవు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 2.37 కోట్లు
సీడెడ్ – రూ. 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.88 కోట్లు
ఈస్ట్ – రూ. 0.60 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.37 కోట్లు
నెల్లూరు – రూ. 0.27 కోట్లు
కృష్ణా – రూ. 0.37 కోట్లు