Telugu Global
National

ఏపీలో మ‌రో ఐఆర్ఎస్ అధికారిపై వేటు !

ఏపీలో వివాద‌స్ప‌ద, అవినీతి అధికారుల‌పై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. మరో అధికారి సిహెచ్‌. వెంక‌ట గోపినాథ్ డిప్యూటేష‌న్‌ను ర‌ద్దు చేసింది. టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన గోపీనాధ్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ప‌లు కాంట్రాక్ట్‌ల పేరుతో అవినీతికి పాల్ప‌డ్డార‌ని… ఈయ‌న‌కు మంత్రి య‌న‌మ‌ల‌తో పాటు చంద్రబాబు అండ‌దండ‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ శాఖ‌లో అవినీతిపై ఇటీవ‌లే ప‌లు నివేదిక‌లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి చేరాయి. ప‌లువురి అధికారుల‌పై చ‌ర్య‌లకు సిపార్స్‌లు కూడా […]

ఏపీలో మ‌రో ఐఆర్ఎస్ అధికారిపై వేటు !
X

ఏపీలో వివాద‌స్ప‌ద, అవినీతి అధికారుల‌పై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. మరో అధికారి సిహెచ్‌. వెంక‌ట గోపినాథ్ డిప్యూటేష‌న్‌ను ర‌ద్దు చేసింది.

టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన గోపీనాధ్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ప‌లు కాంట్రాక్ట్‌ల పేరుతో అవినీతికి పాల్ప‌డ్డార‌ని… ఈయ‌న‌కు మంత్రి య‌న‌మ‌ల‌తో పాటు చంద్రబాబు అండ‌దండ‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఈ శాఖ‌లో అవినీతిపై ఇటీవ‌లే ప‌లు నివేదిక‌లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి చేరాయి. ప‌లువురి అధికారుల‌పై చ‌ర్య‌లకు సిపార్స్‌లు కూడా అందాయి. గోపీనాధ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సిఫార్సు చేశారు.

గోపినాథ్‌ను తిరిగి మాతృశాఖ‌కు బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న‌ డిప్యూటేషన్‌ను ప్రభుత్వం ర‌ద్దు చేసింది. గోపీనాధ్ కోరిక మేరకు ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 26 వరకూ డెప్యూటేషన్ ఉన్నప్పటికీ రద్దు చేయాలని గోపీనాధ్ కోరిన‌ట్లు స‌మాచారం. మాతృ శాఖ అయిన సెంట్రల్ డైరెక్ట్ టాక్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువ‌డ్డాయి.

అయితే య‌న‌మ‌ల గారి అల్లుడు గిల్లుడుపై విచార‌ణ జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వస్తున్న సమాచారం. త్వ‌ర‌లోనే త‌నను విచార‌ణ‌కు పిలుస్తార‌ని త‌ల‌చిన గోపినాథ్ ముందే స‌ర్దుకున్నార‌ని స‌మాచారం.

అయితే ఆయ‌న మాతృ సంస్థ నుండి విచారణకి పిలుస్తారా? అనే దాని మీద క్లారిటీ రావలసిన అవసరం ఉంది. మొత్తానికి చంద్రబాబు హాయాంలో విచ్చ‌ల‌విడిగా అవినీతికి పాల్ప‌డిన బ్యాచ్ మెల్ల‌గా అమ‌రావ‌తి నుంచి జారుకుంటుంది.

First Published:  14 Dec 2019 10:15 PM GMT
Next Story