Telugu Global
Cinema & Entertainment

జీ తెలుగు నుంచి నాగబాబుకు కళ్లు చెదిరే ఆఫర్....

ఈటీవీ జబర్ధస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు.. ఆ షోను నిర్మించిన మల్లెమాలపై వరుస వీడియోలు తీసి తాను ఎందుకు తప్పుకున్నానో వివరించారు. అయితే నాగబాబు లేకున్నా ఇప్పుడా షో రేటింగ్ పడిపోలేదు.. కొనసాగుతూనే ఉంది. తాజాగా జబర్ధస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు.. జీటీవీ నెట్ వర్క్ తో ఓ మంచి లాభదాయక ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ప్రతీ నెల 30లక్షలతోపాటు సెట్ లో, వెలుపల వీఐపీ సౌకర్యాలు, కార్ వాన్ సౌకర్యం కూడా కల్పించాలని ఒప్పందం జరిగిందని […]

జీ తెలుగు నుంచి నాగబాబుకు కళ్లు చెదిరే ఆఫర్....
X

ఈటీవీ జబర్ధస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు.. ఆ షోను నిర్మించిన మల్లెమాలపై వరుస వీడియోలు తీసి తాను ఎందుకు తప్పుకున్నానో వివరించారు. అయితే నాగబాబు లేకున్నా ఇప్పుడా షో రేటింగ్ పడిపోలేదు.. కొనసాగుతూనే ఉంది.

తాజాగా జబర్ధస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు.. జీటీవీ నెట్ వర్క్ తో ఓ మంచి లాభదాయక ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ప్రతీ నెల 30లక్షలతోపాటు సెట్ లో, వెలుపల వీఐపీ సౌకర్యాలు, కార్ వాన్ సౌకర్యం కూడా కల్పించాలని ఒప్పందం జరిగిందని టీవీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తం జీ నెట్ వర్క్ కార్యక్రమాలన్నింటిలోనూ నాగబాబు ఈ ఒప్పందం ప్రకారం పాల్గొనాల్సి ఉంటుంది. అయితే అతిథి పాత్రల్లో లేదా ఏదైనా కార్యక్రమాల్లో హాజరు కావడానికి వీలుగా ఈ పెద్ద మొత్తం 30లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు.

జబర్ధస్త్ సహా ఈటీవీ నెట్ వర్క్స్ లో పాల్గొనే నాగబాబుకు అంతకుముందు 20లక్షల వరకూ వచ్చేవట.. కానీ ఇప్పుడు జీనెట్ వర్క్స్ తో 10లక్షల అదనపు ఆదాయం వచ్చిందని చెప్పుకుంటున్నారు.

నాగబాబు ప్రస్తుతం సినిమాలు మానేశాడు. పూర్తిగా బుల్లితెరకు సమయం కేటాయిస్తున్నాడు.ఈ కోవలోనే తనకు వచ్చే సినిమా ఆఫర్లను చేసుకునేలా ఈ ఒప్పందం ఖరారైందట.

First Published:  15 Dec 2019 9:00 AM GMT
Next Story