Telugu Global
NEWS

పరిటాల కుటుంబానికి ఎదురుదెబ్బ

పరిటాల కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 27 ఏళ్లుగా పరిటాల కుటుంబం ఆధీనంలో ఉన్న ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రామగిరి మండలంలో పరిటాల రవి పొలాలకు సమీపంలోనే నసనకోట ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఆదాయం కోట్లలో ఉంటుంది. భక్తులు భారీగా వస్తుంటారు. ఈ ఆలయం గత 27 ఏళ్లుగా పరిటాల కుటుంబం చేతిలోనే ఉంది. పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండయ్య ఈ ఆలయానికి చైర్మన్‌గా ఉంటూ వస్తున్నారు. పరిటాల కుటుంబ సభ్యులు, వారి అనుచరులతో […]

పరిటాల కుటుంబానికి ఎదురుదెబ్బ
X

పరిటాల కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 27 ఏళ్లుగా పరిటాల కుటుంబం ఆధీనంలో ఉన్న ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

రామగిరి మండలంలో పరిటాల రవి పొలాలకు సమీపంలోనే నసనకోట ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఆదాయం కోట్లలో ఉంటుంది. భక్తులు భారీగా వస్తుంటారు. ఈ ఆలయం గత 27 ఏళ్లుగా పరిటాల కుటుంబం చేతిలోనే ఉంది.

పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండయ్య ఈ ఆలయానికి చైర్మన్‌గా ఉంటూ వస్తున్నారు. పరిటాల కుటుంబ సభ్యులు, వారి అనుచరులతో ఏర్పాటైన ప్రైవేట్‌ పాలక కమిటీ ఆధ్వర్యంలో ఆలయం నడుస్తోంది. ఈ ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు బంగారం, వెండి కానుకలు కూడా వస్తుంటాయి.

ఈ నేపథ్యంలో ఈ ఆలయంపై పరిటాల కుటుంబ పెత్తనానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చాలాకాలంగా పోరాడుతున్నారు. ఆలయంపై ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యాన్ని తొలగించి… ప్రభుత్వమే ఆలయాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.

కోట్లాదిరూపాయల ఆదాయం వస్తుంటే ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారని… బంగారం, వెండి పక్కదారి పట్టిస్తున్నారంటూ చాలాకాలంగా పరిటాల ప్రత్యర్థులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఆలయం వద్ద టెంకాయల విక్రయం, పార్కింగ్ ఫీజు, మద్యం అమ్మకాల ద్వారానే ఏటా 2కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని అంచనా. ఈ విక్రయాలన్నీ పరిటాల అనుచరుల ద్వారానే జరుగుతుంటాయని చెబుతుంటారు.

చాలా మంది భక్తులు విరాళాలు ఇస్తే వాటిని కూడా పరిటాల కుటుంబం బయటకు చెప్పడం లేదని వైసీపీ నేతలు చాలాకాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ దేవాదాయ శాఖ నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. పరిటాల కుటుంబ సభ్యులతో ఏర్పాటైన ప్రైవేట్ కమిటీని దేవాదాయ శాఖ రద్దు చేసింది. దేవాదాయ శాఖ ఆలయానికి ఈవోను నియమించింది. ప్రభుత్వమే త్వరలో పాలక మండలిని ఏర్పాటు చేయబోతోంది.

ఆలయానికి వచ్చిన ఆభరణాలు, విరాళాలకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిందిగా, అకౌంట్స్‌కు సంబంధించిన పుస్తకాలను తక్షణం స్వాధీన పరచాల్సిందిగా గత పాలక సభ్యులకు నోటీసులు జారీ చేసింది.

First Published:  14 Dec 2019 9:53 PM GMT
Next Story