Telugu Global
National

హ‌స్తిన టూ హైద‌రాబాద్... పౌర‌స‌త్వ చ‌ట్టంపై ఆందోళ‌న‌లు

హ‌స్తిన నుంచి హైద‌రాబాద్ వరకు ఆందోళ‌న‌లు పాకాయి. గ‌చ్చిబౌలిలోని మౌలానా అజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్శిటీ, సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో రెండు యూనివర్సిటీ ల దగ్గర భారీగా పోలీసులను మోహ‌రించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌పై రెండు యూనివ‌ర్శిటీల విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. శనివారం యూనివ‌ర్శిటీల‌కు ప‌రిమిత‌మైన ఆందోళ‌న‌…ఆదివారం ఢిల్లీ వీధుల‌కు పాకింది. ఐదు బ‌స్‌ల‌ను ఆందోళ‌న‌కారులు త‌గల‌బెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌, బాష్ఫ‌వాయు గోళాలు ప్ర‌యోగించారు. ద‌క్షిణ […]

హ‌స్తిన టూ హైద‌రాబాద్... పౌర‌స‌త్వ చ‌ట్టంపై ఆందోళ‌న‌లు
X

హ‌స్తిన నుంచి హైద‌రాబాద్ వరకు ఆందోళ‌న‌లు పాకాయి. గ‌చ్చిబౌలిలోని మౌలానా అజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్శిటీ, సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో రెండు యూనివర్సిటీ ల దగ్గర భారీగా పోలీసులను మోహ‌రించారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌పై రెండు యూనివ‌ర్శిటీల విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. శనివారం యూనివ‌ర్శిటీల‌కు ప‌రిమిత‌మైన ఆందోళ‌న‌…ఆదివారం ఢిల్లీ వీధుల‌కు పాకింది. ఐదు బ‌స్‌ల‌ను ఆందోళ‌న‌కారులు త‌గల‌బెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌, బాష్ఫ‌వాయు గోళాలు ప్ర‌యోగించారు. ద‌క్షిణ ఢిల్లీలోని స్కూళ్లు మూసివేశారు. ఇదే ప్రాంతంలో మెట్రో స్టేష‌న్ల‌ను కూడా క్లోజ్ చేశారు.

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ర‌ణ‌రంగంగా మారింది. విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది. బస్సులు, ఆస్తుల ధ్వంసానికి పాల్ప‌డ్డారు. యూనివర్సిటీలోకి చొరబడ్డ పోలీసులు, లాఠీఛార్జి, భాష్పవాయు ప్రయోగించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఘర్షణలో పోలీసులు, విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘర్షణల నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలో విద్యాసంస్థలకు ఢిల్లీ సర్కారు సెలవు ప్రకటించింది.

దక్షిణ ఢిల్లీలోని 15 మెట్రో స్టేషన్ల గేట్లు క్లోజ్ చేశారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్ వద్ద జామియా, జేఎన్‌యూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్ అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలోనూ హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. 15 మంది సంఘవిద్రోహ శక్తులను అదుపులోకి తీసుకున్నట్టు యూపీ పోలీసులు ప్రకటించారు.

హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో జనవరి 5 వరకు యూనివ‌ర్శిటీల‌కు సెల‌వులు ప్రకటించారు. హాస్టళ్ల నుంచి విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఢిల్లీలో పరిస్థితి నివురు గ‌ప్పినా నిప్పులా మారింది.

First Published:  15 Dec 2019 11:15 PM GMT
Next Story