Telugu Global
Cinema & Entertainment

30 రోజులకు 50 కోట్లు.... పవన్ కు దిల్ రాజు ఆఫర్?

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ మూవీని టాలీవుడ్ స్టార్ హీరో, జనసేనాని పవన్ కళ్యాణ్ తో తీయబోతున్నానని అగ్రనిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ వీలును బట్టి కాల్షీట్లు ఖాయం కాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ప్రకటించారు. అయితే పవన్ మాత్రం తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాన్న వార్తలను ఖండిస్తూనే ఉన్నారు. తన మనస్తత్వం నటనకు తగినది కాదని చెబుతూనే ఉన్నారు. అయితే మరోవైపు దిల్ రాజు మాత్రం పింక్ తెలుగు […]

30 రోజులకు 50 కోట్లు.... పవన్ కు దిల్ రాజు ఆఫర్?
X

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ మూవీని టాలీవుడ్ స్టార్ హీరో, జనసేనాని పవన్ కళ్యాణ్ తో తీయబోతున్నానని అగ్రనిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ వీలును బట్టి కాల్షీట్లు ఖాయం కాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ప్రకటించారు.

అయితే పవన్ మాత్రం తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాన్న వార్తలను ఖండిస్తూనే ఉన్నారు. తన మనస్తత్వం నటనకు తగినది కాదని చెబుతూనే ఉన్నారు.

అయితే మరోవైపు దిల్ రాజు మాత్రం పింక్ తెలుగు రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్రిమినల్ లాయర్ పాత్రను పోషించబోతున్నారు. ఔట్ డోర్ షూటింగ్ లేని ఈ సినిమాలో 30 రోజులు నటిస్తే ఏకంగా రూ.50 కోట్ల ఆఫర్ ను పవన్ కళ్యాణ్ కు దిల్ రాజు ఇచ్చాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే పవన్ ఈ సినిమాను తిరస్కరించడం లేదని ఇన్ సైడ్ టాక్.

దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత.. స్టామినా ఉన్న పంపిణీదారు ఏకంగా పవన్ ను నమ్మి రూ.50 కోట్లు ఇస్తామన్నాడంటే పవన్ కూడా పునరాలోచనలో పడిపోయినట్టు తెలిసింది.

పవన్ కు 50 కోట్ల పారితోషికంతోపాటు మిగతా మొత్తం సినిమాను 20 కోట్లలో పూర్తి చేయాలని దిల్ రాజ్ ప్లాన్ చేశాడట.. ఇందులో మామూలు రెమ్యూనరేషన్ కలిగిన హీరోయిన్లు నివేధా థామస్, అంజలి లాంటి వారిని తీసుకుంటున్నాడట.. కొత్త దర్శకుడు శ్రీరామ్ వేణుకు కూడా నెలవారీ జీతం ఇచ్చేలా చిత్రానికి తీసుకున్నాడట.. కేవలం 75 కోట్లలోపే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని దిల్ రాజ్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ వేసవిలో విడుదల చేయాలని.. ఆ ఖాళీ సమయంలో సినిమాలు ఏవీ లేకపోవడంతో పవన్ సినిమాతో కలెక్షన్లు కొల్లగొట్టవచ్చని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకునే… దిల్ రాజు కేవలం నెలరోజుల్లోనే పవన్ టైం వేస్ట్ కాకుండా ఈ సినిమాను తీసేందుకు భారీ వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. అస్సలు పోటీలేని సమ్మర్ లో విడుదల చేసి లాభాలు గడించాలని ప్లాన్ చేస్తున్నాడట.

First Published:  16 Dec 2019 2:09 AM GMT
Next Story