Telugu Global
Cinema & Entertainment

'హీ ఈజ్ సో క్యూట్' అంటున్న రష్మిక

’సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి ముచ్చటగా మూడో పాట వచ్చేసింది. ఈసారి పాట మొత్తం రష్మిక చుట్టూ తిరిగింది. హీ ఈజ్ సో క్యూట్ అంటూ సాగే లిరిక్స్ కు దేవిశ్రీప్రసాద్ ట్యూన్ అందించగా, మధుప్రియ ఆలపించింది. కేరళలో ఈ పాట షూట్ చేశారు. ఈసారి పాటతో పాటు మేకింగ్ కూడా రిలీజ్ చేశారు. హీ ఈజ్ సో క్యూట్..హీ ఈజ్ సో స్వీట్..హీ ఈజ్ సో హ్యాండ్సమ్..అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ గ్లామ‌ర్‌ను పొగిడే ఈ పాట […]

హీ ఈజ్ సో క్యూట్ అంటున్న రష్మిక
X

’సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి ముచ్చటగా మూడో పాట వచ్చేసింది. ఈసారి పాట మొత్తం రష్మిక చుట్టూ తిరిగింది. హీ ఈజ్ సో క్యూట్ అంటూ సాగే లిరిక్స్ కు దేవిశ్రీప్రసాద్ ట్యూన్ అందించగా, మధుప్రియ ఆలపించింది. కేరళలో ఈ పాట షూట్ చేశారు. ఈసారి పాటతో పాటు మేకింగ్ కూడా రిలీజ్ చేశారు.

హీ ఈజ్ సో క్యూట్..హీ ఈజ్ సో స్వీట్..హీ ఈజ్ సో హ్యాండ్సమ్..అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ గ్లామ‌ర్‌ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని దోచుకున్నాడు కధానాయకుడు అనే సందర్భంలో వచ్చే ఫన్ సాంగ్. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ పాటకి శ్రీమణి సాహిత్యం అందించాడు.

అయితే ఎప్పట్లానే ఈ మూడో పాట కూడా విమర్శల పాలైంది. ఇంతకుముందు రిలీజైన 2 పాటలు ఆకట్టుకోకపోగా.. ఇప్పుడా లిస్ట్ లోకి ఈ మూడో పాట కూడా చేరింది. ఇది కూడా గతంలో దేవిశ్రీ కంపోజ్ చేసిన పాటలానే ఉందని, ఎలాంటి కొత్తదనం లేదని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. మరీ ముఖ్యంగా రామ్ హీరోగా ఆమధ్య వచ్చిన శివమ్ సినిమాలో “ప్రేమ అనేది ఒక పిచ్చి” అనే పాటలాగే ఈ కొత్త పాట కూడా ఉందంటూ కామెంట్స్ పడుతున్నాయి.

First Published:  16 Dec 2019 10:00 AM GMT
Next Story