నైజాంలో నిఖిల్ రికార్డు

ఎట్టకేలకు తను ఆశించిన ఫలితాన్ని అందుకోగలిగాడు నిఖిల్. దాదాపు ఏడాదిన్నరగా పోస్ట్ పోన్ అవుతూ రిలీజైన అర్జున్ సురవరం సినిమా తన కెరీర్ కు కాస్తోకూస్తో ప్లస్ అయితే చాలని భావించాడు. విడుదలైన 3 వారాలకు ఈ సినిమాకు సత్ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. నిఖిల్ కు నైజాంలో ఓ అరుదైన రికార్డును అందించింది ఈ సినిమా.

అవును.. నైజాంలో అత్యథిక వసూళ్లు సాధించిన నిఖిల్ సినిమాగా అర్జున్ సురవరం నిలిచింది. నైజాంలో ఈ సినిమాకు ఇప్పటివరకు 3 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నిఖిల్ కెరీర్ లో ఇదే అత్యథికం. మొన్నటివరకు ఈ రికార్డు ఎక్కడికి పోతావ్ చిన్నవాడా పేరిట ఉండేది. ఇప్పుడా రికార్డును అర్జున్ సురవరం తుడిచిపెట్టింది.

ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేసింది. నైజాంలో వీళ్లకున్న బిగ్ నెట్ వర్క్ ఈ సినిమాకు ప్లస్ అయింది. అలా అది నిఖిల్ రికార్డుకు దోహదపడింది. వసూళ్ల పరంగా ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ మార్క్ దాటి, హిట్ మార్క్ అందుకుంది.